సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలపై ట్రోలింగ్ కూడా బాగా ఎక్కువైంది. తరచూ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు కొందరు నెటిజన్లు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కూడా ఈ రకమైన ట్రోలింగ్ ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమెని టార్గెట్ చేస్తూ అసభ్యకర కామెంట్స్ చేయడం బాగా ఎక్కువైంది. బూతులు తిడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు. అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా..
నేరుగా దీపికాకే మెసేజ్ లు పెడుతున్నారు. తనపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తోన్న ట్రోలర్స్ పై దీపికా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు అసభ్యకర రీతిలో మెసేజ్ లు పెట్టిన వారి స్క్రీన్ షాట్ ని తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తూ ”వావ్.. ఇప్పుడు మిమ్మల్ని చూసి మీ కుటుంబ, స్నేహితులు గర్విస్తారు” అంటూ చురకలు అంటిస్తూ పోస్ట్ పెట్టింది. అలా పెట్టిన కాసేపటికే పోస్టును తొలగించింది. కానీ అప్పటికే జనాలు స్క్రీన్ షాట్ తీసి ఆ పోస్ట్ ని వైరల్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా దీపికా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను డిలీట్ చేసి మళ్లీ యాక్టివేట్ చేసింది. ఆమె చివరిగా నటించిన చిత్రం ‘ఛపాక్’. ఇందులో ఆమె యాసిడ్ బాధితురాలి పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హృతిక్ రోషన్ సరసన ‘ఫైటర్’ సినిమాలో అలానే ప్రభాస్ తో కలిసి ‘ఆదిపురుష్’ చిత్రాల్లో నటించనుంది. అలానే ’83’ సినిమాలో తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి నటిస్తోంది.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?