మేకప్ లో సిటీ చుట్టేసిన స్టార్ హీరోయిన్

  • January 7, 2020 / 03:47 PM IST

బాలీవుడ్ స్టార్ లేడీ దీపికా పదుకొనె నటిస్తున్న ప్రయోహాత్మక చిత్రం ఛఫాక్. దీపిక ఈ చిత్రంలో మాలతీ అనే యాసిడ్ అట్టాక్ బాధితురాలిగా ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. లేడీ డైరెక్టర్ మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దీపికా స్వయంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా క్రిటిక్స్ ప్రశంశలతో పాటు, సాధారణ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ చిత్రంతో చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు దీపిక.

అలాగే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల లోకి తీసుకెళ్లడానికి వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. జనవరి 5న తన పుట్టిన రోజు వేడుకను దేశవ్యాప్తంగా ఇలాంటి ఘోర యాసిడ్ అట్టాక్స్ కి గురైన కొందరు యువతులతో కలిసి జరుపుకున్నారు. తాజాగా దీపిక మరో సాహసంతో కూడిన ప్రయోగం చేశారు. నిజమైన యాసిడ్ అట్టాక్ బాధిత యువతులతో కలిసి ముంబైలోని అనేక ప్రదేశాలలో సంచరించారు. అంతే కాకుండా వారి పట్ల వ్యక్తుల ప్రవర్తనా తీరును హిడెన్ కెమెరాలతో చిత్రీకరించారు. పబ్లిక్ లో ఆసిడ్ అట్టాక్ బాధితురాలిగా మేకప్ లో తిరుగుతున్న దీపికను ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం.ఇలా విభిన్నంగా దీపికా తాను నటిస్తున్న ఛఫాక్ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఛఫాక్ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం శంకర్-అహసాన్-లాయ్ అందించారు. అలాగే రణ్వీర్ సింగ్ హీరోగా 83 పేరుతో తెరకెక్కుతున్న లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో దీపికా కపిల్ భార్య పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదల అవుతుంది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus