Deepthi Sunaina: కొత్త ఇల్లు ఎలా కొన్నావ్.. దీప్తి సునయనను ప్రశ్నించిన నేటిజన్!

దీప్తి సునయన పరిచయం అవసరం లేని పేరు యూట్యూబర్ గా ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈమె మరొక యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో ప్రేమ వ్యవహారం కూడా నడిపించారు. అయితే కొన్ని కారణాల వల్ల తనతో ప్రేమకు బ్రేకప్ చెప్పకుండా దీప్తి సునయన ప్రస్తుతం తన కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా దీప్తి తన స్నేహితులతో కలిసి పార్టీలు వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం దీప్తి సునయన హైదరాబాదులో కొత్త ఇంటిని కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తన నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించిన ఈమెకు నేటిజన్స్ నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే ఒక నెటిజన్ సొంత ఇల్లు కొనడానికి అంత డబ్బు ఎలా వచ్చింది…

ఇల్లు ఎలా కొన్నావ్ అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు దీప్తి సునయన సమాధానం చెబుతూ తాను సంపాదించిన దాంట్లో కేవలం 30 శాతం మాత్రమే ఖర్చు చేసి 70% పొదుపు చేసి తన సొంత డబ్బుతోనే ఇల్లు కొనుగోలు చేశానంటూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈమె చెప్పిన ఈ సమాధానం వైరల్ గా మారింది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus