యువ కథానాయకుడి పులిహోర కబుర్లకు ఫిదా అవుతున్న స్టార్ హీరోయిన్లు

జూనియర్ ఆర్టిస్ట్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారిన అతికొద్ది మంది హీరోల్లో మన యువ కథానాయకుడు ఒకడు. అతడితో నటించిన అమ్మాయిలందరూ స్టార్ హీరోయిన్స్ అయిపోగా.. మనోడు మాత్రం ఇంకా సరైన హిట్ కోసం ఎదురుచూపులోనే ఉన్నాడు. కానీ.. జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ హీరోయిన్స్ తో రొమాన్స్ కి మాత్రం ఏం తక్కువ లేదు. తనతో కలిసి సినిమాలు చేసిన హీరోయిన్స్ తో డేటింగ్ అంటే సరేననుకోవచ్చు కానీ. తనతో కలిసి నటించని వారితో కూడా సదరు యువ కథానాయకుడు పులిహోర కలిపేస్తున్నాడంటే మామూలు విషయం కాదు.

సీనియర్ స్టార్ హీరోయిన్స్ అందరితో డేటింగ్ చేసేసిన ఈ యువ కథానాయకుడు ప్రస్తుతం మరో యువ స్టార్ హీరోయిన్ తో చాటింగ్ & మీటింగ్ మొదలెట్టాడు. అపార్ట్ మెంట్ కి వెళ్ళి పికప్ చేసుకోవడం గట్రా కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం స్టార్ హీరోలతో నటిస్తూ యమ బిజీగా ఉంటున్న ఆ యువ హీరోయిన్ కూడా ఈ యువ కథానాయకుడితో ఎందుకు తిరిగుతుందో అర్ధం కాక మిగతావాళ్లు తలలు పట్టుకొంటున్నారు. ఈ కుర్రాడికి సక్సెస్ పరంగా అదృష్టరేఖ సరిగా లేకపోయినా.. హీరోయిన్ల పరంగా మన్మధరేఖ మాత్రం మాంచి ధిట్టంగా ఉంది.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus