బిగ్ బాస్ 4: బరువు ఎత్తింది.. పరువు నిలిపింది.. అమ్మకోరిక తీర్చింది..!

  • November 20, 2020 / 12:26 PM IST

బిగ్ బాస్ హౌస్ లో కొత్త కెప్టెన్ గా అవతరించింది దేత్తడి హారిక. 7సార్లు కంటిన్యూస్ గా పోటీ పడిన హారిక మొత్తానికి కెప్టెన్సీని దక్కించుకుంది. గత కొన్నివారాలుగా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తూ, టాస్క్ లని విజయవంతంగా కంప్లీట్ చేస్తున్నా కూడా ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేకపోయింది. ఈసారి మాత్రం బరువు ఎత్తు అనే కెప్టెన్సీ టాస్క్ లో విన్ అయ్యి కెప్టెన్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది.

హారికతో పాటుగా అఖిల్ ఇంకా అభిజిత్ కెప్టెన్సీ పోటీదారులుగా అయిన సంగతి తెలిసిందే. వీళ్లముగ్గురూ పోటీ పడ్డారు. హారికని ఎత్తుకుని మోనాల్ చాలాసేపు ఉండటంతో హారిక ఈ టాస్క్ లో గెలిచింది. కొత్త కెప్టెన్ అయ్యింది. మొత్తానికి 11వారాల్లో ఫస్ట్ టైమ్ కెప్టెన్ అయి పరువు నిలిపింది. హారిక అమ్మ చెప్పినట్లుగానే ఈసారి గెలిచి ఆమె కోరికని తీర్చింది. ఈ టాస్క్ లో అకిల్ ని సోహైల్, అలాగే అభిజిత్ ని అవినాష్ ఎత్తుకున్నారు. కానీ చివర వరకూ ఉండలేకపోయారు. దీంతో మోనాల్ హారికని ఎత్తుకుని హారికని గెలిపించింది.

 

ఇక కెప్టెన్ గా హారిక ఎలాంటి రూల్స్ పెడుతుంది. ఎవరికి ఎలాంటి వర్క్ అప్పజెప్తుంది అనేది ఆసక్తికరం. అదీ మేటర్. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఫిల్మీ ఫోకస్ సైట్ కి లాగిన్ అవ్వండి.

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus