బిగ్ బాస్ 4: హౌస్ మేట్స్ డిసైడ్ చేసిండ్రు..!

  • November 28, 2020 / 03:44 PM IST

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ కి రేస్ టు ఫినాలే అనేది స్టార్ట్ అయ్యిందని బిగ్ బాస్ ఎనౌన్స్ చేసాడు. ఇందులో భాగంగా ఇకనుంచి ఇంటికి కెప్టెన్ ఉండడు అని, అందుకే కెప్టెన్ బ్యాండ్ కి వీడ్కోలు ఇవ్వాలని చెప్పాడు. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకూ బెస్ట్ కెప్టెన్ ఎవరు..? వరెస్ట్ కెప్టెన్ ఎవరు అనేది డిసైడ్ చేయాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. ఇక్కడే బెస్ట్ కెప్టెన్ గా అందరూ కలిసి హారికని ఎంచుకున్నారు. ఫస్ట్ లో సోహైల్ తనకి తానే ఓటు వేస్కున్నా, ఆ తర్వాత మెజారిటీ ఓటింగ్ ప్రకారం హారికకే ఓటు వేయాల్సి వచ్చింది.

హౌస్ మేట్స్ అందరూ కూడా ఇప్పటివరకూ 8సార్లు కెప్టెన్సీ టాస్క్ లో పోరాడి కెప్టెన్ అయ్యింది కాబట్టి హారికే బెస్ట్ కెప్టెన్ అని చెప్పి ఓట్లు వేశారు. నిజానికి ఇన్నిసార్లు కెప్టెన్సీ రేస్ లో ఉండటం అనేది బిగ్ బాస్ లో రికార్డ్. టాస్క్ బాగా ఆడితేనే ఈరకమైన హోదా అనేది దక్కుతుంది. ఇప్పటివరకూ జరిగిన టాస్క్ లు అన్నింటిలోనూ బెస్ట్ గా హారిక నిలిచినట్లుగా అర్ధమవుతోంది. అందుకే, హౌస్ మేట్స్ కి బాగా నచ్చిన కెప్టెన్ గా ఎంపికైంది.

ఇక వరెస్ట్ కెప్టెన్ గా హౌస్ మేట్స్ అరియానాని ఎంచుకున్నారు. ఫస్ట్ అబిజిత్ అఖిల్ పేరు చెప్పాడు. చాలా ఈజీగా కెప్టెన్ అయ్యావ్ కాబట్టి, అఖిల్ నీపేరు చెప్తున్నా అంటూ చెప్పాడు అబిజిత్. సోహైల్ అరియానా కెప్టెన్సీలో నేను ఘోరమైన టార్చర్ అనుభవించా అంటూ అరియానా పేరు చెప్పాడు. ఇలా మొదట్లో మిక్స్ ఓపీనియన్స్ చెప్పినా ఆ తర్వాత అందరూ కలిసి అరియానా పేరు చెప్పాల్సి వచ్చింది. అందుకే, అరియానా వరెస్ట్ కెప్టెన్ అయ్యింది. చివరగా కెప్టెన్ బ్యాండ్ కి హౌస్ మేట్స్ వీడ్కోలు పలికారు. అదీ మేటర్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus