బిగ్ బాస్ 4: ఆడపిల్ల కాదు హౌస్ లో ఆడపులి..!

  • December 3, 2020 / 01:18 PM IST

బిగ్ బాస్ హౌస్ లో రేసు టు ఫినాలే టాస్క్ లో హారిక దుమ్మురేపింది. సోహైల్ తో ఈక్వల్ గా గేమ్ ఆడుతూ.. నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ ఆడింది. ఫ్లవర్స్ పడుతుంటే సోహైల్ ని తోసేసి మరీ ఫ్లవర్స్ ని గుంజుకుంది. అక్కడే సోహైల్ ని రెచ్చగొట్టింది. అంతేకాదు, తాను చాలా సిన్సియర్ గా గేమ్ ఆడాను అని అందరికీ అర్ధమయ్యేలా చేసింది.

నిజానికి ఇదే విషయంలో అరియానా కూడా చాలాసేపు బాధపడింది. ఆవుపాల టాస్క్ అప్పుడు బిగ్ బాస్ ఇది వ్యక్తిగతమైన ఆట అని మరోసారి తెలియజేస్తున్నారు అని ఎనౌన్స్ మెంట్ వచ్చినపుడు అరియానా ఫీల్ అయ్యింది. ఇది నిన్ననే చెప్పాల్సింది కదా గేమ్ లో నేను ఇండివెడ్యువల్ గానే ఆడాను అంటూ చాలాసేపు బాధపడింది.

ఎప్పుడైతే ఈ ఎనౌన్స్ మెంట్ వచ్చిందో అప్పుడు హారిక తన గేమ్ ప్లాన్ ని వర్కౌట్ చేసింది. ఒకవేళ ఫ్లవర్స్ తక్కువ కలెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్లగ్ చేస్కుని నీవి తీసేసుకుంటాను అంటూ సోహైల్ తో మాట్లాడింది. దీంతో సోహైల్ హారికతో యుద్ధానికి దిగాడు. అంతేకాదు, సెకండ్ టైమ్ ఫ్లవర్స్ పడినపుడు సోహైల్ చేతిలో ఫ్లవర్ ని గుంజుకుంది. దీంతో ఆవేశపడ్డాడు సోహైల్. అక్కడే బస్తీమే సవాల్ చూస్కుందాం అంటూ గేమ్ లో కి ఆడపులిలా దిగింది హారిక. ఎంటైర్ టాస్క్ లో లెవల్ టు లో ఓడిపోయినప్పటికీ , హారిక గేమ్ మాత్రం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. నచ్చేసింది. అదీ మేటర్.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus