విశ్వక్ సేన్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ధియేటర్లో కంటే కూడా ఓటీటీలో, రీ రిలీజ్లో ఎక్కువ అప్రీషియేషన్ పొందింది అని చెప్పాలి. తరుణ్ భాస్కర్ ఏ సినిమా ఈవెంట్లో కనిపించినా.. ‘ ‘ఈఎన్ఈ’ సీక్వెల్ ఎప్పుడు?’ అంటూ అరుపులు వినిపించడం మనం చూశాం. వారందరి కోరికని గమనించి.. మొత్తానికి ‘ఈఎన్ఈ’ సీక్వెల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేనందుకు రెడీ అయ్యాడు తరుణ్ భాస్కర్.
‘ఈఎన్ఈ రిపీట్'(ENE Repeat) పేరుతో ఈ సీక్వెల్ రెడీ అయ్యింది. నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ’35 చిన్న కథ కాదు’ చిత్రాన్ని నిర్మించిన సుజన్ యరబోలు ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ను నిర్మించారు. క్రేజీ సీక్వెల్ కావడంతో మొదటి నుండీ ట్రేడ్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆలస్యం చేయకుండా ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు గమనిస్తే :
| నైజాం | 1.30 cr |
| సీడెడ్ | 0.26 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.96 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 2.52 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.43 cr |
| ఓవర్సీస్ | 0.90 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 3.85 cr (షేర్) |
‘ఈ ఎన్ ఈ రిపీట్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ అయితే చాలా పెద్దదే. విశ్వక్ సేన్ ఇప్పుడు ఫామ్లో లేడు. తరుణ్ భాస్కర్ కూడా అంతే..! డీసెంట్ టాక్ తెచ్చుకుంటే ‘ఈ ఎన్ ఈ’ క్రేజ్, హైప్ కలిసొచ్చి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉంటాయి.