‘బట్టల రామస్వామి బయోపిక్కు’ సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్తాఫ్ హసన్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తూ ‘రాజిగాడు రాజయ్యాడు’ అనే కొత్త చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను శర్మాస్ ఫిలింస్ బ్యానర్ పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. ‘రాజిగాడు రాజయ్యాడు'(Rajigadu Rajayyadu) మూవీలో అను శ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డా. గోరటి వెంకన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు ‘రాజిగాడు రాజయ్యాడు’ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
నటుడు కేశవ మాట్లాడుతూ – మంచి కాన్సెప్ట్, స్టోరీతో వస్తున్న చిత్రమిది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను మీరు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాగే మా సినిమాను కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు అశోక్ రెడ్డి మాట్లాడుతూ – ఈ సినిమా టైటిల్ లోనే ఒక రిథమ్ ఉంది. ఈ టైటిల్ ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుందని నమ్ముతున్నాను. నేను ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తున్నాను. ఇలాంటి మంచి రోల్ ఇచ్చిన డైరెక్టర్ అల్తాఫ్ గారికి థ్యాంక్స్. అన్నారు.
నటుడు శివకుమార్ కాముని మాట్లాడుతూ – అప్పట్లో టి కృష్ణ గారి సినిమాలు ఎలా ఉండేవో అలా సామాజిక చైతన్యాన్ని కలిగించే చిత్రమిది. ఈ సినిమాలో నేను విలన్ బావమరిది క్యారెక్టర్ లో నటిస్తున్నాను. మీ ఆదదరణ కోరుతూ త్వరలోనే మా మూవీ ముందుకు రాబోతోంది. అన్నారు.
నటుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ – ఫేమస్ అయిన ఆర్టిస్టులతోనే సినిమాలు చేయాలని మేకర్స్ కోరుకుంటారు. కానీ మాలాంటి రంగస్థల నటులతో సినిమా చేసినందుకు మా డైరెక్టర్ హీరో అల్తాఫ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్నారు.
నటుడు గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ – ఈ సినిమా టైటిల్ లోనే మీకు కథ ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. మేము షూటింగ్ చేసేప్పుడే అక్కడ ఉన్న వాళ్లు అందరూ చాలా బాగుందని చెప్పేవారు. ఈ సినిమా కోసం అల్తాఫ్ అన్న చాలా కష్టపడ్డారు. అన్నారు.
నటి విజయలక్ష్మి మాట్లాడుతూ – ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ అల్తాఫ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. నేను గతంలో కిష్కిందపురి సినిమాలో ఘోస్ట్ రోల్ లో చేశాను. ఈ చిత్రంతో నటిగా మరింత గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
డైలాగ్ రైటర్ రమేష్ మాట్లాడుతూ – నేను ఇష్క్, దృశ్యం 2 చిత్రాలకు డైలాగ్ రైటర్ గా వర్క్ చేశాను. నేను ఈ సినిమాకు వర్క్ చేయాలని అల్తాఫ్ అడిగారు. ఈ చిత్రంలో నేను రాసిన డైలాగ్స్ గోరటి వెంకన్న లాంటి ఆర్టిస్టులు చెప్పినప్పుడు ఎంతో హ్యాపీగా ఫీలయ్యాను. అన్నారు.
లిరిసిస్ట్ లక్ష్మణ్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో ట్యూన్ ను స్టూడియోలోనే వింటూ లైవ్ లో పాట రాశాను. ఇదొక ప్రయోగం అనుకోవచ్చు. లిరిసిస్ట్ గా గోరటి వెంకన్న గారితో పాటు నా పేరు టైటిల్స్ లో చూసుకోవడం గర్వంగా ఉంది. గోరటి వెంకన్న గారి అభిమానులంతా ఈ సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
స్క్రిప్ట్ రైటర్ సూర్యారావు మాట్లాడుతూ – బహుజన వర్గాల ప్రజలంతా మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా. ఇది నాటకంగా ప్రదర్శించినప్పుడు ఎంతోమంది ప్రశంసలు లభించాయి. సినిమాకు కూడా అలాగే మీ అందరి అభినందనలు దక్కాలి. అన్నారు.
స్టోరీ రైటర్ డి.విజయభాస్కర్ మాట్లాడుతూ – నాటక రచయితను నేను. ఈ చిత్రంలో అల్తాఫ్ నన్ను సినిమా రైటర్ గా మార్చారు. గ్రామాల్లో ఆధిపత్యం ఎవరిది ఉంటుందో మనకు తెలుసు. బడుగులంతా చైతన్యవంతమై అలాంటి ఆధిపత్యం మీద తిరగబడితే ఎలా ఉంటుందో మా సినిమాలో చూస్తారు. అన్నారు.
ఎడిటర్ సతీష్ రాజా మాట్లాడుతూ – ఈ సినిమాకు వర్క్ చేయడం గర్వంగా ఉంది. మా సినిమాలోని కంటెంట్ అంతా చూస్తే ఇది నేషనల్ అవార్డ్ సాధిస్తుందని నమ్మకం ఉంది. అంత గుర్తింపు దక్కేలా మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.
డీవోపీ పీఎస్ మణికర్ణన్ మాట్లాడుతూ – అల్తాఫ్ గారితో నేను చేస్తున్న రెండో చిత్రమిది. సినిమాకు అందరూ కష్టపడే పనిచేస్తారు. కానీ అల్తాఫ్ తనకు ఏ వనరులు లేని పరిస్థితుల్లోనూ మంచి సినిమా చేశారు. అన్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ – సామాజిక చైతన్యానికి నాంది పలికే చిత్రమిది. మన దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలున్నాయి. ప్రతి గ్రామంలోనూ సమన్యాయం జరగాలనే ఆకాంక్ష ఈ చిత్ర కథాంశంలో మనకు కనిపిస్తుంటుంది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలి. అన్నారు.
నటుడు సంజయ్ గౌడ్ మాట్లాడుతూ – ఈ సినిమా రూటెడ్ గా నేచురల్ గా ఉంటుంది. కథ జరిగే లొకేషన్స్ కూడా చాలా సహజంగా ఉంటూ ఆకట్టుకుంటాయి. అల్తాఫ్ పర్పెక్షన్ కోరుకుంటాడు. చేసే సినిమా అందరికీ నచ్చాలని నమ్ముతాడు. ఇదొక ఫెంటాస్టిక్ మూవీగా పేరు తెచ్చుకుంటుంది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ జగదీశ్ సత్యన్ మాట్లాడుతూ – ఈ సినిమాలో 7 పాటలు ఉంటాయి. దానిలో ఒక సాంగ్ గోరటి వెంకన్న గారు రాశారు. మిగతావి లక్ష్మణ్ రాశారు. గోరటి గారితో వర్క్ చేయడాన్ని గౌరవంగా భావించాను. ఈ చిత్రంలో కొత్త తరహా మ్యూజిక్ వింటారు. అన్నారు.
నటి అను శ్రీ మాట్లాడుతూ -నేను గతంలో దేవగుడి అనే చిత్రంలో నటించాను. ఆ సినిమాలో రాయలసీమ అమ్మాయిగా కనిపించాను. ఈ చిత్రంలో తెలంగాణ అమ్మాయి పాత్రలో నటిస్తున్నాను. నేను వాస్తవంగా కోనసీమ అమ్మాయిని. ఈ సినిమాకు మంచి టీమ్ పనిచేశారు. అప్పట్లో జయసుధ, విజయశాంతి గారి క్యారెక్టర్స్ ను డైరెక్టర్ ఎలా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో నా పాత్రను అల్తాఫ్ గారు అలా డిజైన్ చేశారు. మీ అందరికీ మా మూవీ బాగా నచ్చుతుంది. అన్నారు.
నిర్మాత చిన్ని మాట్లాడుతూ – రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలైంది. నేను ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచీ ఉన్నాను. నేను సినిమాలను ఇష్టపడతా. అయితే నేనే ప్రొడ్యూసర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి కంప్లీట్ అయ్యేవరకు జరిగే జర్నీ నేను చూశాను. దాంతో నాకు సినిమాల మీద గౌరవం మరింత పెరిగింది. మా టీమ్ లోని ప్రతి ఒక్కరి సపోర్ట్ వల్లే అడ్డంకులు దాటుకుని ఇక్కడిదాకా వచ్చాం. సినిమా బాగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.
హీరో, డైరెక్టర్ అల్తాఫ్ హసన్ మాట్లాడుతూ – మా ప్రొడ్యూసర్ చిన్ని వల్లే మా అందరి కల నిజమవుతోంది. విజయ్ భాస్కర్ గారు రాసిన నాటకం ఈ సినిమాకు మూలం. ఆయనతో మూడు నెలల పాటు స్క్రిప్ట్ డిస్కషన్స్ చేసి సినిమాకు కథను అడాప్ట్ చేసుకున్నాం. పల్లె కన్నీరు పెడుతుందో అనే గొప్ప పాట రాసిన గోరటి గారే ఈ సినిమాకు అలాంటి పాట రాయగలరని ఆయనను అప్రోచ్ అయ్యాం. మా నాన్న పాత్ర కూడా ఆయనే చేయాలని కోరాం. ఈ సినిమాకు వర్క్ చేసిన వాళ్లు నా ఫ్యామిలీలా భావిస్తా. మా మూవీకి జగదీశ్ ఏడు ఆణిముత్యాల్లాంటి పాటలు అందించారు. ఆ పాటలు మా సినిమాకు సోల్ లా మారాయి. మా డీవోపీ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. గొప్ప పర్పస్ ఉన్న ఇన్స్ పైరింగ్ మూవీ ఇది. మీరంతా మా ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నా. అన్నారు.
గీత రచయిత, నటుడు డా.గోరటి వెంకన్న మాట్లాడుతూ – చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధాలు కొందరు సృష్టించినవి. కానీ కళ అయిన సినిమాకు అలాంటి బేధం లేదు. ఇతర భాషల చిత్రాలు ఆ బేధాలు చెరిపేస్తున్నాయి. తెలుగులో కూడా ఆ మార్పు వస్తుంది. ఈ చిత్ర కథా రచయిత ఎన్నో గొప్ప అవార్డ్స్ పొందిన వారు. ఆయన నాటకం కూడా నంది పురస్కారాలు పొందింది. అలాంటి గొప్ప కథను ఈసినిమాకు ఎంచుకున్నారు అల్తాఫ్. నేను ఈ సినిమాను మూడు సార్లు చూశా ఎప్పుడూ బోర్ రాలేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీలో ఉంటాయి. మూస చిత్రాలు భిన్నంగా అల్తాఫ్ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఈ సినిమాలో నేనొక మంచి క్యారెక్టర్ కూడా చేశాను. ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో రావడం లేదు. ఒక జీవితాన్ని చూసిన ఫీల్ కలిగిస్తుంది. ఏ ప్రాంతం నేపథ్యంతో వస్తున్న కథైనా మనకు హార్ట్ టచింగ్ గా ఉండాలి. మనసును తాకే ఆ తరహా కథతో వస్తున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలి. అన్నారు.