Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ టైర్-3 హీరో. అయినప్పటికీ అతని సినిమాలపై ఓ సెక్షన్ ఆఫ్ మాస్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే ఎక్కువగా సక్సెస్‌లు లేకపోయినా, మినిమమ్ మార్కెట్‌తో సర్వైవ్ అవుతున్నాడు. అతనితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపించడానికి కారణం కూడా అదే..! అయితే ఒక్కోసారి అతని మార్కెట్‌కి మించి ఖర్చు పెట్టేసి నిర్మాతలు ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Haindava

మరోసారి ఇప్పుడు ఇలాంటిదే జరిగింది. వాస్తవానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత చిత్రం ‘కిష్కింధపురి’ హిట్ అయ్యింది. కాకపోతే అది రూ.30 కోట్ల బడ్జెట్‌లో తీసిన సినిమా. నాన్-థియేట్రికల్ రూపంలోనే ఆ సినిమాకు రూ.18 కోట్ల వరకు రికవరీ జరగడంతో థియేటర్లపై పెద్దగా భారం పడలేదు. దీంతో ఈజీగా బ్రేక్-ఈవెన్ సాధించి క్లీన్ హిట్ అనిపించుకుంది. అయితే అతని లేటెస్ట్ మూవీ ‘హైందవ’కి(Haindava) వచ్చేసరికి ఏకంగా రూ.55 కోట్ల బడ్జెట్ పెట్టారట.

‘కిష్కింధపురి’తో పోలిస్తే ఆల్మోస్ట్ డబుల్ బడ్జెట్ పెట్టినట్లే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు జరిగిన రికవరీని చూసుకుంటే.. నాన్-థియేట్రికల్ రూపంలో రూ.24 కోట్లు వెనక్కి రాబట్టింది. ఇది పెద్ద మొత్తమే అయినప్పటికీ, పెట్టిన బడ్జెట్ దృష్ట్యా చూసుకుంటే తక్కువే అని చెప్పాలి. సో ఇప్పుడు థియేటర్ల నుండి రూ.31 కోట్లు వెనక్కి రాబట్టాలి. ప్రెజెంట్ ట్రెండ్‌ను బట్టి చూస్తే.. ‘హైందవ’ సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.

పైగా నవంబర్ 27న, అదీ అన్-సీజన్‌లో రిలీజ్ అవుతోంది. తొలిరోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప బ్రేక్-ఈవెన్ సాధించడం ఈజీ కాదనే చెప్పాలి. చూడాలి మరి ఏమవుతుందో..!

ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus