Pushpa2: బన్నీ సుకుమార్ కాంబో మూవీలో జాన్వీ కపూర్.. కానీ?

ఈ ఏడాది విడుదలవుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో పుష్ప ది రూల్ మూవీ ఒకటి. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. పుష్ప ది రూల్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో జాన్వీ కపూర్ కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న వార్తలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే హీరోయిన్ గా వరుస ఆఫర్లు వస్తున్న సమయంలో జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పే అవకాశం అయితే లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

పుష్ప ది రూల్ టీమ్ లేదా జాన్వీ కపూర్ స్పందిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జాన్వీ కపూర్ ఫ్యాన్స్ మాత్రం వైరల్ అవుతున్న వార్తను నమ్మడం లేదు. పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ వేగంగానే జరుగుతుండగా జూన్ చివరి నాటికి ఈ సినిమా షూట్ పూర్తయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి ప్రతి సీన్ విషయంలో సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

పుష్ప ది రూల్ సినిమా బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ సినిమా సాంగ్స్ ఏ స్థాయిలో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పుష్ప ది రూల్ (Pushpa2) సినిమాలో ట్విస్ట్ లు సైతం అదిరిపోయే రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. పుష్ప ది రూల్ సినిమాకు ఇతర సినిమాల నుంచి పోటీ లేకపోతే మాత్రం కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus