Devara 300Cr: ఫస్ట్ వీకెండ్ హయ్యస్ట్ రికార్డ్ సృష్టించిన ఎన్టీఆర్!

రికార్డులు సృష్టించడం ఎన్టీఆర్ కు (Jr NTR)  కొత్తేమీ కాదు. అతి చిన్న వయసులోనే “ఆది” (Aadi) సినిమాతో తెలుగు సినిమా రికార్డులు తిరగరాసిన చరిత్ర ఉన్న ఏకైక తెలుగు హీరో ఎన్టీఆర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత మళ్లీ “సింహాద్రి” (Simhadri) తోనూ భారీ రికార్డులు నెలకొల్పాడు. మళ్లీ ఇన్నాళ్లకు “దేవర”తో (Devara) భారీ రికార్డులు సృష్టిస్తున్నాడు ఎన్టీఆర్. మొదటిరోజు ఏకంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తో నాన్-రాజమౌళి రికార్డ్ క్రియేట్ చేసిన దేవర, ఫస్ట్ వీకెండ్ లో ఏకంగా 304 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఎన్టీఆర్ కెరీర్ లోన్ హయ్యస్ట్ ఫస్ట్ వీక్ రికార్డ్ క్రియేట్ చేసింది.

Devara 300Cr:

నిజానికి దేవరకి వచ్చిన పబ్లిక్ టాక్ కి ఈస్థాయి కలెక్షన్స్ ఎవరూ ఊహించలేదు. కానీ.. ఎన్టీఆర్ స్టార్ డం, సినిమాకి ఉన్న ప్రీరిలీజ్ బజ్ కారణంగా ఫస్ట్ వీకెండ్ భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. పాపం “ఆచార్య”తో (Acharya) బోలెడంత చెడ్డ పేరు మూటగట్టుకున్న కొరటాల శివ (Koratala Siva)  “దేవర” రిజల్ట్ తో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సినిమా కొరటాల బెస్ట్ వర్క్ కాకపోయినప్పటికీ.. ఆయన మీదున్న నెగిటివ్ ఇంప్రెషన్ ను మాత్రం పోగొట్టింది.

ఇక ఈవారం నుండి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి కాబట్టి, ఓటీటీ విడుదలకు దాదాపుగా 50 రోజుల సమయం ఉండే అవకాశం ఉంది కాబట్టి.. దేవర “600 కోట్ల” మార్క్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వెల్లడవుతున్నాయి. మరి దేవర ఆ అంచనాలను అందుకోగలుగుతాడో లేదో తెలియదు కానీ..

ప్రస్తుతానికి “దేవర” క్రియేట్ చేసిన రికార్డులను మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ & డిస్ట్రిబ్యూటర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులు అవుట్ రైట్ గా సొంతం చేసుకున్న సితార సంస్థ మరియు నాగవంశీ కూడా కలెక్షన్స్ తో ఫుల్ హ్యాపీ అని తెలుస్తోంది.

‘దేవర’ సక్సెస్ మీట్‌?.. ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? ఇదేనా ఆలోచన..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus