SPYder Movie: 7 ఏళ్ళ ‘స్పైడర్’ గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

  • September 28, 2024 / 05:58 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ (A.R. Murugadoss) కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే అంచనాలు ఎలా ఉంటాయి చెప్పండి. ఊహించినట్టుగానే ‘స్పైడర్’ (Spyder)పై అంచనాలు ఆ విధంగా ఏర్పడ్డాయి. అయితే 2017 సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా ఆ అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మహేష్ బాబు (Mahesh Babu) చేసిన మొదటి బై లింగ్యువల్ మూవీ ఇది. మురుగదాస్ మంచి ఫామ్లో ఉన్న దర్శకుడు. హారిస్ జయరాజ్ (Harris Jayaraj) సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ మంచి హిట్ అయ్యాయి.

అయినా సరే ఎందుకో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. ఇదిలా ఉండగా.. నేటితో ‘స్పైడర్’ రిలీజ్ అయ్యి 7 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

SPYder

1) దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ ‘ఒక్కడు’ (Okkadu) సినిమా టైం నుండి మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఆ టైంలో తమిళంలో ఫుల్ బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఒకానొక టైంలో ‘తుపాకీ’ (Thuppakki) కథ మహేష్ బాబు కోసం రెడీ చేసుకున్నారు. తెలుగు/తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ ఆ టైంలో మహేష్ బాబు వరుస సినిమాలకి కమిట్ అవ్వడం వల్ల మురుగదాస్ కి ఓకే చెప్పలేకపోయాడు. తర్వాత విజయ్ (Vijay Thalapathy) తో ‘తుపాకీ’ చేసి సూపర్ హిట్ కొట్టాడు మురుగదాస్.

2) ‘తుపాకీ’ మిస్ చేసుకున్నాక మహేష్ చాలా ఫీల్ అయ్యాడట. తర్వాత మురుగదాస్ ని కలిసి ఓ సినిమా కచ్చితంగా చేద్దాం అనుకున్నారట.

3) ఇదిలా ఉంటే.. ‘శ్రీమంతుడు’ (Srimanthudu) సినిమా ‘రిలయన్స్ ఎంటర్టైన్మెంట్’ వారితో చేయాలి మహేష్ బాబు. కానీ కొన్ని కారణాల వల్ల అది ‘మైత్రి మూవీ మేకర్స్’ వారికి వెళ్ళింది. అలా వారికి మహేష్ ఓ సినిమా బాకీ పడ్డాడు.

4) 2016లో మురుగదాస్ ‘స్పైడర్’ కథ మహేష్ కి వినిపించారు. వెంటనే దానికి ఓకే చెప్పేశాడు మహేష్. ఎన్.వి.ప్రసాద్..తో పాటు ‘రియలన్స్..’ వారిని కూడా ‘స్పైడర్’ నిర్మాణంలో భాగస్వామిగా చేశాడు. అలా ‘స్పైడర్’ ప్రాజెక్ట్ మొదలైంది.

5) ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదట గుబురు గడ్డం పెంచాడు. లుక్ రివీల్ కాకూడదు అని భావించి.. విదేశాలకి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు మహేష్. ఆ టైంలో కొన్ని ఫోటోలు ఇంటర్నెట్..లో లీక్ అయ్యాయి. తర్వాత వాటిని మహేష్ టీం డిలీట్ చేయడం జరిగింది. అయితే లుక్ టెస్ట్ చేశాక.. సెట్ అవ్వలేదు అని, మళ్ళీ మార్చారు.

6) ఇక ‘స్పైడర్’ లో హీరోయిన్ గా… ముందు బాలీవుడ్ భామ పరిణితీ చోప్రాను (Parineeti Chopra) ఎంపిక చేసుకున్నారు. ఆమెకు తెలుగు క్లాసెస్ కూడా చెప్పించారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ని (Rakul Preet Singh) ఫైనల్ చేశారు.

7) ‘స్పైడర్’ ను ముందు ద్విభాషా చిత్రంగా ప్రారంభించారు. అయితే తమిళంలో మహేష్ ను లాంచ్ చేసే ఉద్దేశంతో.. మురుగదాస్ కథలో మార్పులు చేశారు.ఈ క్రమంలో తెలుగు నేటివిటీ లోపించింది.

8) ‘స్పైడర్’ తెలుగు, తమిళ వెర్షన్లను గమనిస్తే.. ప్రియదర్శి (Priyadarshi), ఆర్.జె.బాలాజీ (RJ Balaji) రోల్స్ స్వాప్ అవుతాయి.

9) తమిళ వెర్షన్ కి మహేష్ బాబు ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు. అది ఒక విశేషంగా చెప్పుకోవాలి.

10) ‘స్పైడర్’ కి విలన్ రోల్ కోసం ముందుగా మాధవన్ (R.Madhavan) , అరవింద్ స్వామి (Arvind Swamy) ..లను అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఎస్.జె.సూర్యని (SJ Surya) ఫైనల్ చేశారు.

11) ‘స్పైడర్’ కి రూ.125 కోట్ల బడ్జెట్ పెట్టారు. మహేష్ బాబు స్టార్ డం వల్ల బిజినెస్ బాగా జరిగింది.

12) అయితే ప్లాప్ టాక్ రావడం వల్ల.. సగానికి సగం నష్టం వచ్చింది.

13) తమిళ రైట్స్ తీసుకున్న నిర్మాత సేఫ్ అయ్యారు. అక్కడ పెద్దగా నష్టాలు రాలేదు. కానీ తెలుగులో బయ్యర్స్ బాగా నష్టపోయారు. ఈ క్రమంలో ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) కోసం తీసుకున్న పారితోషికంలో కొంత భాగాన్ని మహేష్ వెనక్కి ఇచ్చారు. ఇంకొంతమంది బయ్యర్స్ కి ‘భరత్ అనే నేను’ థియేట్రికల్ రైట్స్ కూడా ఇప్పించడం జరిగింది.

 భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ‘దేవర’

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus