Jani Master: ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?

కొన్ని రోజుల క్రితం జానీ మాస్టర్ (Jani Master) అరెస్ట్ కావడం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే జానీ మాస్టర్ పోలీస్ విచారణలో వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. జానీ మాస్టర్ పోలీస్ విచారణలో తనపై ఏదో కుట్ర జరుగుతోందని చెప్పాడని సమాచారం. తాను ఫిర్యాదు ఇచ్చిన యువతిని వేధించలేదని ఆమే తనను వేధించిందని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.

Jani Master

సదరు యువతితో దర్శకుడు సుకుమార్ (Sukumar) మాట్లాడినా ఫలితం లేకుండా పోయిందని జానీ మాస్టర్ చెప్పినట్టు సమాచారం అందుతోంది. నా ఎదుగుదలను ఓర్వలేక నాపై కేసు పెట్టించారని టాలెంట్ ఉంది కాబట్టే ఆమెకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చానని జానీ మాస్టర్ వెల్లడించారని సమాచారం. జానీ మాస్టర్ భార్య స్పందిస్తూ జానీ మాస్టర్ నేరం అంగీకరించినట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని తెలిపారు.

నా భర్తను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఏదో చెబితే మీడియా ఇంకేదో రాస్తోందంటూ అయేషా ఫైర్ అయ్యారు. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేశారని సమాచారం అందుతోంది. జానీ మాస్టర్ కెరీర్ పై ఈ వివాదం ఎంతమేర ప్రభావం పడుతుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.

జానీ మాస్టర్ ఇప్పటికే పలు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ ప్రాజెక్ట్ ల విషయంలో సైతం ఒకింత కన్ఫ్యూజన్ నెలకొందని తెలుస్తోంది. జానీ మాస్టర్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ ఈ వివాదం నుంచి బయటపడతారో లేక రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత పెద్దదవుతుందో చూడాల్సి ఉంది. జానీ మాస్టర్ కు బెయిల్ రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బాలయ్యపై ఆ స్టేట్మెంట్స్ నిజం కాదంటున్న ఊర్వశి.. ఏమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus