టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRRసినిమా తర్వాత ఇప్పటివరకు ఎలాంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కూడా ఇతరసినిమాల మాదిరిగానే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా మంచిగా కుదరడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్లాన్ చేయాలనే ఆలోచనలో డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయాన్ని దేవర (Devara) సినిమా విడుదలైన తర్వాతనే ప్రకటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతమైతే పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హాలీవుడ్ రేంజ్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి.
ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ట్రాన్స్ఫార్మర్స్కు పని చేసిన స్టంట్ మాస్టర్, ఆక్వా మ్యాన్ చిత్రానికి వర్క్ చేసిన VFX డిజైనర్.. ఈ మూవీ ప్రొడక్షన్ లో భాగం అయ్యారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే జాన్వీ కపూర్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు.