Devil Collections: ‘డెవిల్’ మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ‘అభిషేక్ పిక్చ‌ర్స్’ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా నిర్మించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. నిన్న అంటే డిసెంబ‌ర్ 29న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.

కళ్యాణ్ రామ్ నటన, ట్విస్ట్ లు.. ఈ సినిమాకు హైలెట్ అని అంతా అన్నారు. కానీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.67 cr
సీడెడ్ 0.30 cr
ఉత్తరాంధ్ర 0.16 cr
ఈస్ట్ 0.15 cr
వెస్ట్ 0.09 cr
గుంటూరు 0.16 cr
కృష్ణా 0.10 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.68 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.18 cr
 ఓవర్సీస్ 0.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.26 cr (షేర్)

‘డెవిల్’ (Devil)  చిత్రానికి రూ.20.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కి రూ.20.7 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాలి. మొదటి రోజు ఈ సినిమా రూ.2.26 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ రూ.18.44 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus