Devil OTT: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న డెవిల్.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన డెవిల్ మూవీ గత నెల 29వ తేదీన థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే అప్పటికే థియేటర్లలో సలార్ మూవీ ప్రభంజనం కొనసాగుతుండటంతో డెవిల్ మూవీకి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది.

విడుదలైన రెండు వారాలకే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నట్టు ఒక పోస్టర్ వైరల్ అవుతోంది. అయితే మేకర్స్ నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ మాత్రం ట్విట్టర్ లో డెవిల్ గురించి ప్రకటన చేయలేదు. సంక్రాంతి పండుగ కానుకగా ఎక్కువ సినిమాలు రిలీజ్ కావడంతో డెవిల్ మూవీ ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ప్రదర్శించబడటం లేదు.

డెవిల్ సినిమా (Devil) ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే మాత్రం ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. బింబిసార సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొనగా త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. దేవర సినిమాకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

దేవర సినిమా ఏప్రిల్ నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. గతంలో జై లవకుశ సినిమాతో నిర్మాతగా భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో ఆ సినిమాను మించిన విజయాన్ని అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దేవర సినిమా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ రాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus