దెయ్యం గుడ్డిదైతే..!? ట్రైలర్ ఆర్.జి.వి రిలీజ్ చేస్తే..??

యువ ప్రతిభాశాలి దాసరి సాయిరాం దర్శకత్వం.. సంధ్య స్టూడియో సమర్పణలో.. భీమవరం టాకీస్ పతాకంపై శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హార్రర్ థ్రిల్లర్ “దెయ్యం గుడ్డిధైతే”. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ వినూత్న కథాచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఈ చిత్రం ట్రైలర్.. దెయ్యం చిత్రాల రూపకల్పనలో సిద్ధహస్తుడైన దర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… “నేను దెయ్యం సినిమాలు చాలా తీశాను. ఆ తరహా చిత్రాలు లెక్కలేనన్ని చూశాను. కానీ… దెయ్యం సినిమాలో.. దెయ్యం గుడ్డిది కావడం ఇప్పటివరకూ చూడలేదు. దానిని హైలైట్ చేస్తూ… “దెయ్యం గుడ్డిదైతే” అనే టైటిల్ పెట్టడం ఇంకా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. ఈ సినిమా సాయిరామ్ దాసరికి దర్శకుడిగా మంచి పేరు తీసుకురావాలని విష్ చేస్తున్నాను” అన్నారు.

దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. “సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మా “దెయ్యం గుడ్డిదైతే” చిత్రం ట్రైలర్ రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు. సుమీత్-జాకీర్-హైమ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా: రాఘవ, ఎడిటర్: రంగస్వామి, స్క్రీన్ ప్లే-డైలాగ్స్-డి ఐ: జానీ బాషా, ఆడియోగ్రఫీ 5.1: శ్రీమిత్ర, టైటిల్స్ & పోస్టర్స్ ప్రవీణ్ తమటం, సమర్పణ: సంధ్య స్టూడియో, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: సాయిరామ్ దాసరి!!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus