Ravi Teja: చిరు సినిమాపై బజ్ పెంచేసిన ‘ధమాకా’!

మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ ను ఊపేయడంతో రవితేజ ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. ప్రస్తుతానికి వీక్ డేస్ లో డ్రాప్ కనిపిస్తున్నప్పటికీ.. మొదటి మూడు రోజుల వసూళ్లు మాత్రం ఓ రేంజ్ లో వచ్చేశాయి. బ్రేక్ ఈవెన్ దాటేయడంతో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు చేసిన గాయాలు పూర్తిగా మాసిపోయాయి. కనీసం మరో వారం రోజులు స్ట్రాంగ్ రన్ ఖాయమనిపిస్తోంది.

ఫైనల్ గా సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చెప్పలేం కానీ.. మాస్ సెంటర్స్ లో మంచి రెవెన్యూ కొనసాగడం ఖాయమని ట్రేడ్ నమ్మకంగా చెబుతోంది. ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ ‘వాల్తేర్ వీరయ్య’కు ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ‘ధమాకా’ టాక్ ఏమాత్రం అటు ఇటు అయినా.. చిరంజీవి సినిమాలో రవితేజ చేసింది స్పెషల్ రోల్ కాబట్టి ఫ్యాన్స్ జోష్ చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు ఉత్సాహం రెట్టింపు అయింది. అది ఓపెనింగ్స్ కి హెల్ప్ అవుతుంది.

పైగా రవితేజ ఈరోజు నుంచి చిరంజీవితో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొనున్నారు. ఇప్పటివరకు సినిమాలో వీరి క్యారెక్టర్స్ కు సంబంధించి సెపరేట్ గా టీజర్స్ ను వదిలారు. అయితే కాంబో సాంగ్ ఒకటి ఉంది. అందులో ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తారు. ఆ పాట రిలీజ్ కావాల్సి ఉంది. సంక్రాంతికి పోటీ ఉండడంతో ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గకుండా చూసుకోవాలి.

ఇప్పటివరకు రిలీజైన మూడు పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇకపై వచ్చే ఏ ప్రమోషన్ కంటెంట్ అయినా.. సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ‘అఖండ’ సినిమా సక్సెస్.. ‘అన్ స్టాపబుల్’ షోకి వచ్చిన రెస్పాన్స్ తో బాలయ్య ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. దీంతో ‘వీర సింహారెడ్డి’పై క్రేజ్ పెరిగింది. దాంతో పోటీకి దిగిన ‘వాల్తేర్ వీరయ్య’ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి!

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus