Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

ధ్రువ్‌ విక్రమ్‌ తొలి తెలుగు సినిమాకు సర్వం సిద్ధమైందా? టాలీవుడ్‌లో తొలి సినిమా చేయబోతున్నాడా? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో ఓ పెద్ద బ్యానర్‌లో ధ్రువ్‌ సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ కూడా వచ్చేస్తుంది అని చెబుతున్నారు. అయితే ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి చేస్తారా? లేక తమిళంలో చేసి తెలుగు అని చెబుతారా అనేది చూడాలి.

Dhruv Vikram

కోలీవుడ్ ప్రముఖ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ గతేడాది ‘బైసన్’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా తెలుగులో ఆశించినంత విజయం అందుకోకపోయినా ప్రామిసింగ్‌ హీరో అని అనిపించుకున్నాడు. ఆ ఫలితమో లేక ధ్రువ్‌ మీద నమ్మకమో కానీ మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ సినిమా చేయడానికి ధ్రువ్‌ని ఓకే చేసింది అని చెబుతున్నారు. ఇందులో హీరోయిన్లుగా రుక్మిణి వసంత్‌, శ్రీలీల నటిస్తారు అని కూడా అంటున్నారు.

గతంలో ధ్రువ్‌ హీరోగా మణిరత్నం ఓ ప్రేమకథ తీస్తారనే ప్రచారం సాగింది. అప్పుడు హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ పేరే వినిపించింది. అయితే ఆ సినిమా ముందుకెళ్లలేదు. ఇప్పుడు ఈ సినిమాతో ఆ కాంబో వర్కవుట్‌ అయ్యేలా ఉంది. ఇదంతా ఓకే దర్శకుడు ఎవరు అనేగా మీ డౌట్‌. దీపక్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాను తెరకెక్కిస్తారట. ‘మనసానమః’ అనే షార్ట్ ఫిల్మ్‌ తీసిన దీపక్కే.. ఈ దీపక్‌ అని చెబుతున్నారు.

ఆ షార్ట్‌ ఫిల్మ్‌తో దీపక్‌ మంచి పేరే సంపాదించారు. ఇతర భాషల్లోకి ఆ లఘుచిత్రం డబ్‌ అయ్యి మంచి విజయం అందుకుంది. ఇక ధ్రువ్‌ విషయానికొస్తే తండ్రిలా ప్రామిసింగ్‌ హీరో అనిపించుకున్నా సరైన విజయం రావడం లేదు. మంచి కథలు పడుతున్నా విజయాలు దక్కడం లేదు. మరి ఈ సినిమా ఆ లోటును తీరుస్తుందేమో చూడాలి.

డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus