Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 19, 2026 / 07:05 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రణ్వీర్ సింగ్ (Hero)
  • సారా అర్జున్ (Heroine)
  • సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా,అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి తదితరులు (Cast)
  • ఆదిత్య ధర్ (Director)
  • ఆదిత్య ధర్, జ్యోతి దేశ్ పాండే, లోకేష్ ధర్ (Producer)
  • శాశ్వత్ సచ్ దేవ్ (Music)
  • వికాస్ నోవ్లాఖా (Cinematography)
  • శివ్ కుమార్ వి పనికర్ (Editor)
  • Release Date : మార్చి 19 2025
  • 'జియో స్టూడియోస్' 'బి62 స్టూడియోస్' (Banner)

గతేడాది చివర్లో వచ్చిన ‘దురంధర్’ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. రణ్వీర్ సింగ్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ స్పై యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1400 కోట్ల(గ్రాస్) వసూళ్లను రాబట్టింది. దీనికి కొనసాగింపుగా ‘దురంధర్ ది రివెంజ్'(దురంధర్ 2) (Dhurandhar The Revenge) చిత్రాన్ని కూడా సమాంతరంగా తెరకెక్కించారు దర్శకులు ఆదిత్య ధర్.బాలీవుడ్లో మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.తెలుగు రాష్ట్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి పెద్ద సినిమా పక్కన పోటీగా రిలీజ్ అవుతుండటం వల్ల ఎక్కువగా వార్తల్లో నిలిచింది ‘దురంధర్ : ది రివెంజ్’. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఆ సినిమాతో పోటీ పడింది. మరి ఆ హైప్ ని మ్యాచ్ చేసేలా సినిమా ఉందో లేదో తెలుసుకుందాం రండి :

Dhurandhar: The Revenge Movie Review

Dhurandhar The Revenge Movie Review and Rating

కథ: పార్ట్ 1 కథ ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుండే సెకండ్ పార్ట్ కథ మొదలవుతుంది. రెహ్మాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణం అనంతరం పాకిస్థాన్లో చోటు చేసుకున్న అల్లర్లు, హంజా (Ranveer Singh) కింగ్ అయ్యి కూర్చోవడంతో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. కానీ హంజా… జస్ క్రీత్ సింగ్ అనే ఒక క్రిమినల్ అని .. అతను జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే చిక్కు ముడులు కూడా ఈ రెండో భాగంలో విప్పుతూ వచ్చారు. జస్ క్రీత్ సింగ్ గతం విషయానికి వస్తే అతనికి దేశభక్తి ఎక్కువ.ఒకానొక సందర్భంలో అతను తన ఫ్యామిలీ కారణంగా క్రిమినల్ గా మారాల్సి వస్తుంది. తర్వాత జైలుకి వెళ్లిన ఇతనికి అజయ్ సన్యాల్ ఎలా పరిచయం అయ్యాడు.

ఆపరేషన్ దురంధర్ లో ఎలా భాగం అయ్యాడు? మరోవైపు రెహ్మాన్ చనిపోయాక అతని ప్లేస్ లోకి వచ్చిన హంజా.. ఐ ఎస్ ఐ తీవ్రవాదులు ఇండియాపై ప్లాన్ చేస్తున్న దాడులను ఆపుతూ వస్తాడు. అందుకు అడ్డొచ్చిన వాళ్ళని సైతం తప్పిస్తూ ఉంటాడు. కానీ ఒక పొరపాటు వల్ల మేజర్ ఇక్బాల్(అర్జున్ రాంపాల్) కి దొరికిపోతాడు. హంజా భారతీయుడు అని ఇక్బాల్ కి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఇతని వల్ల హంజాకి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని హంజా ఎలా అధిగమించాడు? వంటి విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Dhurandhar The Revenge Movie Review and Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: మొదటి భాగం విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ ఇచ్చిన హై మూమెంట్స్ అంత ఈజీగా మర్చిపోయేవి కాదు. ముఖ్యంగా రెహ్మాన్ పాత్రని అతను తీర్చిదిద్దిన తీరు, అలాగే క్లైమాక్స్ ను మలిచిన విధానం అబ్బురపరిచింది. స్పై యాక్షన్ సినిమాని అంత ఎంగేజింగ్ గా అదే సమయంలో అంత డీటెయిలింగ్ గా చెప్పడం అనుకున్నంత సులభం ఏమీ కాదు. ఆదిత్య ధర్ మాత్రం ఆ విషయంలో తన మార్క్ చూపించాడు. సెకండ్ పార్ట్ విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ అంతా హీరో బ్యాక్ స్టోరీతోనే నింపేస్తాడేమో అని అంతా అనుకుంటారు. కానీ మొదటి పావు గంటకే దాని నుండీ డైవర్ట్ చేసి ట్విస్ట్ ఇస్తాడు. ఇంటర్వెల్ వరకు సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు. ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అనే ఫీలింగ్ ఇస్తుంది ఫస్ట్ హాఫ్. అయితే సెకండాఫ్ లో అవసరానికి మించిన సన్నివేశాలు పెట్టడం వల్ల అక్కడక్కడా సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ కొన్ని సర్ప్రైజ్ …లతో మేనేజ్ చేసేశాడు. ప్రీ క్లైమాక్స్ నుండీ మళ్ళీ ఆడియన్స్ అలెర్ట్ అవుతారు. విజువల్ గా దురంధర్ 2 రిచ్ గానే కనిపిస్తుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఫస్ట్ పార్ట్ ఇచ్చిన రేంజ్లో కిక్ ఇవ్వలేదు.

Dhurandhar The Revenge Movie Review and Rating

నటీనటుల విషయానికి వస్తే.. రణ్వీర్ సింగ్ రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రలో ఒదిగిపోయాడు. గెటప్స్, యాక్షన్ సీన్స్ ఇలా ఎందులో చూసుకున్నా తన ఎఫర్ట్ వంద శాతం పెట్టాడు అని చెప్పాలి. సారా అర్జున్ మొదటి భాగంతో పోలిస్తే.. ఇందులో ఆమె స్క్రీన్ స్పేస్ తక్కువ. ఫస్ట్ పార్ట్ లో ఆకట్టుకున్న మాధవన్ పాత్ర కూడా ఈ సెకండ్ పార్ట్ లో లిమిటెడ్ గా ఉంటుంది. సంజయ్ దత్ పాత్ర కూడా సెకండ్ పార్ట్ లో అక్కడక్కడా మెరుస్తుంటుంది. రాకేష్ బేడీ , అర్జున్ రాంపాల్ మాత్రం అదరగొట్టారు.

Dhurandhar The Revenge Movie Review and Rating

విశ్లేషణ: దురంధర్ 2.. (Dhurandhar The Revenge) సీక్వెల్ పై ఉన్న అంచనాలను వంద శాతం మ్యాచ్ చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సెకండాఫ్ కొంచెం లెంగ్తీగా అనిపించినా, హింస శృతి మించినా… ఎమోషన్ క్యారీ అవ్వడంతో అవి ఇబ్బందిగా ఏమీ అనిపించవు. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి భాగానికి మించి కలెక్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

Dhurandhar The Revenge Movie Review and Rating

ఫోకస్ పాయింట్: లెంగ్త్ ఎక్కువైనా స్త్రెంత్ ఉంది

రేటింగ్ : 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #arjun rampal
  • #Dhurandhar: The Revenge Movie
  • #Madhavan
  • #Ranveer Singh
  • #Sanjay Dutt

Reviews

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

10 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

43 mins ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

2 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

3 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

4 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version