Game Changer: గేమ్ ఛేంజర్ పై అంచనాలు పెంచిన రైటర్.. రాజీ పడలేదంటూ?

రామ్ చరణ్ (Ram Charan)  శంకర్ (Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే భారతీయుడు2 (Bharateeyudu -2) సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో గేమ్ ఛేంజర్ సినిమా ఎలా ఉండబోతుందనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. అయితే రైటర్ సాయిమాధవ్ బుర్రా మెగా ఫ్యాన్స్ లో ఈ టెన్షన్ తగ్గించారు. గేమ్ ఛేంజర్ మూవీ కంప్లీట్ ప్యాకేజ్ అని శంకర్ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడలేదని సాయిమాధవ్ బుర్రా అభిప్రాయపడ్డారు.

సాయిమాధవ్ బుర్రా (Sai Madhav Burra)  ఒక విధంగా చరణ్ అభిమానులకు సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదనే భరోసా ఇచ్చారు. సాయిమాధవ్ బుర్రా అంత నమ్మకంతో చెప్పారంటే గేమ్ ఛేంజర్ కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. గేమ్ ఛేంజర్ సినిమాను ఈ ఏడాదే విడుదల చేస్తే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అద్భుతాలు చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో యాక్షన్ సీన్స్ కు పెద్దపీట వేసినట్టు సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తైతే మాత్రమే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. గేమ్ ఛేంజర్ సినిమా ఒకే పార్ట్ గా తెరకెక్కనుందని మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేసింది. గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి చాలా ఏరియాలకు ఇప్పటికే బిజినెస్ పూర్తైందని భోగట్టా.

గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. రామ్ చరణ్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ సినిమాగా నిలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus