డిసెంబర్ 4 నైట్ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ప్రీమియర్ షోలు వేశారు. ఈ సినిమాకి వెయ్యికి పైగా టికెట్ రేట్లు పెట్టినా అభిమానులు వెనక్కి తగ్గలేదు. మరోపక్క సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ (Allu Arjun) తన ఫ్యామిలీతో పాటు స్నేహితుడు శిల్పా రవి ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్లారు. థియేటర్ విజిట్ ప్లానింగ్స్ ఉన్నప్పుడు.. కనీసం 6-12 గంటల మధ్యలో పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అప్పుడు కూడా వాళ్ళు అనుమతి ఇస్తేనే వెళ్ళాలి. కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఏర్పరచగలం అనే నమ్మకం వచ్చాకే పోలీసులు అనుమతి ఇస్తారు.
కానీ అల్లు అర్జున్ ఇలాంటివి సీరియస్ గా తీసుకోకుండా.. తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని చాటుకోవడానికి ర్యాలీ నిర్వహించుకుని మరీ థియేటర్ కి వెళ్లారు. ఆ తర్వాత థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఓ నిండు ప్రాణం బలైపోయింది. దీంతో థియేటర్ యాజమాన్యంపై అలాగే అల్లు అర్జున్ అలాగే అతని టీంపై కేసు నమోదైంది. పెద్దవాళ్ళకి ఇవన్నీ పెద్ద లెక్క కాదులే అని అంతా చర్చించుకున్నారు. కానీ అల్లు అర్జున్ చేసిన దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి.
రేవతి అనే మహిళ మరణించడానికి పరోక్షంగా అతనే కారణం. మరోపక్క థియేటర్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తమ థియేటర్ ని లీజుకి ఇచ్చేసినట్టు చెప్పి సైడ్ అయ్యారు. ఫైనల్ గా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ విషయం ముందుగా తెలుసుకునే అల్లు అర్జున్.. 2 రోజుల క్రితం ‘కేసును కొట్టివేయాలని’ క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడట.
‘తొక్కిసలాట ఘటనకు తాను కారణం కాదని’ కూడా బన్నీ అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది అని సమాచారం. ఇక బన్నీని అరెస్ట్ చేసే ముందు.. ‘నా బెడ్ రూమ్ వరకు మీరు ఎలా వస్తారు?’ అంటూ కొత్త పాయింట్ తీసి కవర్ చేయాలని ప్రయత్నించాడట. కానీ అది కూడా విఫలమైనట్లు ఇన్సైడ్ టాక్. చూడాలి మరి ఫైనల్ గా బన్నీకి బెయిల్ వస్తుందో లేదో..!