హిట్ వచ్చినా…కష్టాల్లో త్రివిక్రమ్!!!

టాలీవుడ్ ను ఏలుతున్న దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. తొలి రోజుల్లో సినిమాలకు కధ, మాటలను అందించిన త్రివిక్రమ్ దర్శకుడిగా మారి తన సత్తా చాటుతూ వస్తున్నాడు. అయితే వరుస హిట్స్ తో ఇరగదీసిన త్రివిక్రమ్ కు అనుకోకుండా స్టైలిష్ స్టార్ బన్నీతో చేసిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ అనుకున్నంత హిట్ కాకపోవటం తో కాస్త వెనక్కి తగ్గాడు ఈ మాటల మాంత్రికుడు. అయితే కాస్త గ్యాప్ తీసుకుని నితిన్, సమంతా జంటగా తెరకెక్కించిన “అ…ఆ” సినిమా మళ్లీ త్రివిక్రమ్ కు హిట్ ను అందించింది.

సినిమా తొలి షో నుంచే హిట్ టాక్ రావడంతో అందరూ హ్యాపీ. కానీ ఇక్కడే ట్విష్ట్ ఉంది. సినిమాకు హిట్ టాక్ అయితే వచ్చింది కానీ, లాభాలు మాత్రం పెద్దగా రాలేదు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు…దానికి గల కారణం ఏంటి అంటే….ఈ మూవీకి ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి కానీ, తరువాత ప్రేక్షక ఆధరణ తగ్గించింది. దీంతో కలెక్షన్స్ అంతగా రాలేదు. ఇక ప్రధాన పట్టణాల్లోనూ, ఓవర్సీస్ లో ఈ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చాయి.

ఈ విధంగా చూసుకుంటే సినిమా హిట్ అయినా నిర్మాత పెద్దగా లాభా పడింది ఏమీ లేదు. ఇదే క్రమంలో ఈ సినిమా రిసల్ట్ త్రివిక్రమ్ తరువాత సినిమాపై ఉంటుంది అని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి…బహుశా ఇదేనేమో….ఆపరేషన్ సక్సెస్…బట్ పేషెంట్ డైడ్ అంటే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus