జయసుధ సోదరి మాత్రమే కాదు ఆమె కూతురు కూడా సినిమాల్లో రాణించలేకపోయింది..!

సినిమా పరిశ్రమలో ఓ హీరోయిన్ క్లిక్ అయితే.. ఆమె అక్కా లేదా చెల్లెలు సినీ పరిశ్రమకి పరిచయమవుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఎప్పటి నుండో ఉన్న పద్దతే అని చెప్పాలి. రాధ-అంబికా,ఆర్తి అగర్వాల్- అదితి అగర్వాల్, కాజల్ అగర్వాల్- నిషా అగర్వాల్… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ చాలానే ఉంది.ఆ కోవకే చెందిన వారే జయసుధ- సుభాషిణి కూడా.! అయితే వీళ్ళు ఇద్దరూ హీరోయిన్లుగా రాణించలేదు.

ఒకరు స్టార్ అయితే మరొకరు డిజాస్టర్ అయ్యారు. జయసుధ బాగా సక్సెస్.. అయితే సుభాషిణి సక్సెస్ కాలేదు. బుల్లితెర పై ‘నాగాస్త్రం’ ‘సుందరకాండ’ వంటి పలు సీరియల్స్ లో నటించింది. కానీ అవి కూడా ఈమెకు మంచి పేరు తీసుకురాలేదు. ‘సీతయ్య’ ‘అరుంధతి’ వంటి పెద్ద సినిమాల్లో నటించినా ఈమె బిజీ ఆర్టిస్ట్ కాలేకపోయింది. అయితే సుభాషిణి కూతురు కూడా ఓ సినిమాలో నటించింది. ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. ఆమె పేరు పూజ ప్రియాంక.

పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయి రామ్ శంకర్ తో చేసిన ‘143 ‘లో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. ఆ మూవీలో సాయిని వన్ సైడ్ లవ్ చేస్తూ కనిపించింది ఈ బ్యూటీ . ఆ సినిమా ఆడలేదు. కానీ కొంతమందికి నచ్చింది. దీంతో ఆమె కూడా సినిమాల జోలికి పోలేదు. 2012లో పూజ ప్రియాంకకు ఆకెళ్ల చంద్ర శేఖర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus