గతంలో పూరీ జగన్నాథ్ (Puri Jagannadh).. మీడియాకి,ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉండేవారు. ఆడియన్స్ పల్స్ ఏంటి.. వాళ్ళ టేస్ట్ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇవన్నీ అంచనా వేసుకునే వారు. మీడియాతో తరచూ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల.. వీటి గురించి ఆయనకు మరిన్ని విషయాలు తెలిసేవి. ‘టెంపర్’ (Temper) వరకు అంతా బాగానే ఉంది. కానీ ‘జ్యోతిలక్ష్మి’ (Jyothi Lakshmi) చేసినప్పటి నుండి అతనికి ఛార్మీ (Charmy Kaur) దగ్గరైంది. ఆ సినిమాకి ఛార్మీ కూడా ఒక నిర్మాత అనే సంగతి తెలిసిందే.
మెయిన్ నిర్మాత సి.కళ్యాణ్ అయినా.. ఆ ప్రాజెక్టు విషయంలో చాలా వరకు ఆధిపత్యం చెలాయించింది ఛార్మీనే అని అప్పట్లో అంతా చెప్పుకున్నారు. ఆ తర్వాత పూరీ చేసిన ‘లోఫర్’ (Loafer) ‘ఇజం’ (Ism) ‘రోగ్’ (Rogue) ‘పైసా వసూల్’ (Paisa Vasool) ‘మెహబూబా’ (Mehbooba) ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) ‘రొమాంటిక్’ (Romantic) ‘లైగర్’ (Liger) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart).. ఇలా అన్ని సినిమాలని పూరీ, ఛార్మీ కలిసి నిర్మించారు. వీటిలో ‘ఇస్మార్ట్ శంకర్’ తప్ప అన్నీ ఫ్లాప్ అయ్యాయి. హిట్స్, ప్లాప్స్ అనేవి పూరీకి కొత్త కాదు.
కానీ ఆయన ఫిలిం మేకింగ్లో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఉదయం 7 గంటలకు షూటింగ్ మొదలు పెడితే సాయంత్రం 7 వరకు కూడా షూటింగ్ చేసేవాడట పూరీ. ఆ తర్వాత నెక్స్ట్ రోజు షెడ్యూల్ కోసం రెడీ అయ్యేవాడు. దాని వల్ల ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ అయ్యేవి. కానీ ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు షూటింగ్ మొదలుపెడితే.. సాయంత్రం 5,6 కి ప్యాకప్ చెప్పేసి పార్టీకి వెళ్ళిపోయి.. మిడ్ నైట్ వరకు ఎంజాయ్మెంట్ మూడ్లోనే పూరీ ఉంటున్నట్టు టాక్ వచ్చింది.
అంతేకాకుండా తాను ఎక్కువగా ముంబైలోనే ఉంటూ వస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అందుకే పూరీతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు అనే టాక్ కూడా ఉంది. అయితే ఇప్పుడు పూరీ బయట నిర్మాతలకి కథలు వినిపించడం మొదలుపెట్టారట. ఇటీవల ఆయన హైదరాబాద్లో ఎక్కువగా ఉంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో పూరీ, ఛార్మీ సెపరేట్ అయిపోయారా? అనే చర్చ కూడా మొదలవుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.