సినీ పరిశ్రమని వరుస విషాదాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్ దర్శకురాలు అపర్ణ మల్లాది, నిర్మాత మనో అక్కినేని,నటుడు జయశీలన్,మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ (Gopi Sundar) తల్లి లివి సురేష్ బాబు,సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, అలాగే రానా (Rana) అమ్మమ్మ రాజేశ్వరి, నిర్మాత వేద రాజు టింబర్,నిర్మాత కేపీ చౌదరి, సీనియర్ నటి పుష్పలత, మలయాళ నటుడు అజిత్ విజయన్, దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి (Chandra Sekhar Yeleti) తండ్రి, లెజెండరీ పాప్ సింగర్ రాబెర్టా ఫ్లాక్,హాలీవుడ్ సీనియర్ హీరో జీన్ హ్యాక్ మ్యాన్, జయప్రద (Jaya Prada)సోదరుడు రాజబాబు,
ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ,మలయాళ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్, సీనియర్ నటి రజిత (Rajitha) తల్లి వంటి వారు మరణించారు. ఈ విషాదాల నుండి ఇంకా కోలుకోకుండానే తమిళంలో మరో విషాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ దర్శకుడు భారతీరాజా (Bharathiraja ) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని కుమారుడు అయినటువంటి మనోజ్ భారతీరాజా ఈరోజు కన్నుమూసినట్టు సమాచారం.
కార్డియాక్ అరెస్ట్(గుండెపోటు సంభవించడంతో) వల్ల అతన్ని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. చికిత్స పొందుతూనే కొద్ది సేపటి క్రితం అతను మరణించినట్టు తెలుస్తుంది.మనోజ్ భారతీరాజా వయసు కేవలం 48 ఏళ్ళు మాత్రమే కావడం అత్యంత విషాదకరం. దీంతో భారతీరాజా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. విషయం తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు భారతీరాజాని పరామర్శించేందుకు వెళ్లినట్టు తెలుస్తుంది.
మరికొంతమంది అయితే ‘భారతీరాజా కుటుంబానికి ఇది తీరని లోటు అని.. భగవంతుడు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని.. అలాగే మనోజ్ ఆత్మకు కూడా శాంతి చేకూరాలని’ సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక మనోజ్ భారతీరాజా తమిళంలో ‘తాజ్ మహల్’ ‘అల్లీ అర్జున’ ‘అన్నక్కోడి’ ‘పల్లవన్’ వంటి సినిమాల్లో నటించారు.