టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ అభిమానులకు ఆదివారం ఉదయం లేవగానే షాక్ లాంటి వార్త వినిపించింది. తమ అభిమాన హీరో శర్వానంద్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు అని, ఆసుపత్రిలో ఉన్నాడనేది ఆ వార్తల సారాంశం. దీంతో ఒక్కసారి ఉలిక్కిపడిన శర్వ అభిమానులు ఏమైంది అంటూ ఆరా తీయడం ప్రారంభించారు. టీవీల్లో, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు కనిపించాయి. వీటితోనే సతమతం అవుతున్న అభిమానులకు ఆయన టీమ్ ఇంకా కన్‌ఫ్యూజ్ చేసింది అని చెప్పొచ్చు.
శర్వానంద్‌కు చెందిన రేంజి రోవర్ కారు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ జంక్షన్ వద్ద అదుపు తప్పింది అని తొలుత సమాచారం వచ్చింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది అని తెలిసిందే. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి శర్వానంద్ కారు డివైడర్ ఎక్కేయడంతో ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. కారు కొంత భాగం దెబ్బతింది అని మాత్రం చెప్పారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ విషయంలో (Sharwanand) శర్వానంద్ టీమ్ మరో వెర్షన్‌ను బయటకు తీసింది. ప్రమాదం విషయంలో శర్వా అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ తెలిపింది. తొలుత శర్వానంద్‌కు గాయాలైనట్లు ప్రచారం జరగడంతో అలాంటిది ఏమీ లేదని చెప్పింది. ఇది చాలా చిన్న ఘటన అని.. కారులో అందరూ క్షేమంగానే ఉన్నారని టీమ్ స్పష్టం చేసింది. దీంతో ఇంకాస్త కన్‌ఫ్యూజ్ వచ్చింది. తొలుత ఆ ప్రమాదం జరిగిన సమయంలో శర్వానంద్ ఆ కారులో లేరని టీమ్ చెప్పే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత ఏం కాలేదు అని చెప్పారు. దీంతో చిన్నపాటి కన్‌ఫ్యూజన్ వచ్చింది. అయితే పోలీసులు మాత్రం శర్వానంద్ అక్కడే ఉన్నారు అని తేల్చారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారట. ఎలాంటి మద్యం సేవించలేదని తనిఖీల్లో తేలిందట. దీంతో ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!