చిరంజీవి, బాలకృష్ణలతో దిల్ రాజు సినిమా?

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇప్పటి వరకూ 32 సినిమాలు నిర్మించాడు. హిట్ పర్సన్టేజ్ బాగా ఎక్కువ ఉన్న ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు టాప్ లో ఉన్నాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐ.ఎఫ్.ఎఫ్ఐ (ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న క్రమంలో గోవాలోని మిరామర్ బీచ్ సమీపంలో ఓ మల్టీప్లెక్స్ లో ‘ఎఫ్2’ మరియు పెద్ద ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘వరకట్నం’ సినిమాల్ని ప్రదర్శించారట. ఇది తెలుగు సినిమాకి అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన దిల్ రాజు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాడు.

ప్రస్తుతం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సహా శర్వానంద్, సమంత ల ’96’ రీమేక్ అలాగే నాని, సుధీర్ బాబు ల ‘వి’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపాడు. ఇక పవన్ కళ్యాణ్ తో కూడా ‘పింక్’ సినిమా రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ‘చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్లతో ఇప్పటి వరకూ సినిమాలు చేసే అవకాశం దక్కలేదు. వారితో సినిమాలు చేయాలని నా కోరిక. మంచి స్క్రిప్ట్ దొరికితే వారితో సినిమాలు చేయడానికి రెడీ గా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus