తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అందరినీ ఊరిస్తున్న సినిమాల్లో మహేష్ స్పైడర్ నంబర్ వన్ స్థానంలో ఉంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్నీ సొంతం చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడుతున్నారు. తాజాగా నైజాం ఏరియా థియేటర్స్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఇందుకోసం 25 కోట్లు చెల్లించారని సమాచారం. ఈ రేట్ చూసి అందరూ షాక్ తింటున్నారు. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన శ్రీమంతుడు నైజాంలో 20 కోట్లు వసూలు చేసింది.
ఆ మొత్తంకంటే మరో ఐదు అదనంగా పెట్టి స్పైడర్ కొనడాన్ని సాహసంగా చెప్పుకుంటున్నారు. ఖైదీ నంబర్ 150, కాటమరాయుడు చిత్రాలను కూడా ఇక్కడ 20 కోట్లకే విక్రయించారు. ఇప్పుడు స్పైడర్ 25 కోట్లు పలికి సంచలనం సృష్టించింది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కాబోతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.