ఎన్టీఆర్ తో సినిమా వల్ల చాల నష్టపోయానన్న దిల్ రాజు !

టాలీవుడ్ లో డిస్ట్రబ్యూటర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని…నిర్మాతగా మారి…టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న నిర్మాత దిల్ రాజు…ఒకప్పుడు ఈయన పట్టిందల్లా బంగారం అయ్యేది అన్న టాక్ బలంగా వినిపించేది…తాజాగా అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం సినిమాతో ఫ్లాప్ ను మూటగట్టుకున్న దిల్ రాజు…ఎన్టీఆర్ సినిమా పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు…అసలు దిల్ రాజు ఏమన్నాడు అంటే…యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో రామయ్య వస్తావయ్య సినిమా తీసి తప్పు చేశానని…రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు హరిష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమా చేసి తప్పు చేశామని తన మదిలొని మాటను బయట పెట్టాడు. అయితే ఎందుకలా అనిపించింది అని అడగగా….అసలైతే ఎన్.టి.ఆర్ తో హరిష్ శంకర్ వేరే కథ అనుకోగా అది అప్పుడే రిలీజ్ అయిన రెబల్ కథకు దగ్గరగా ఉండటంతో ఆ కథను మార్చి మళ్లీ రామయ్య వస్తావయ్య కథ సిద్ధం చేశామని. అది కూడా ఎన్.టి.ఆర్ డేట్స్ ఇచ్చాడు కాబట్టి త్వర త్వరగా చేశామని అన్నారు.

కచ్చితంగా ఆ సినిమా కాకుండా రెబల్ కథకు అటు ఇటుగా ఉన్న ముందు కథనే తీసి ఉంటే కనీసం హిట్ అయినా వచ్చేదని అన్నారు. ఎన్.టి.ఆర్ తో అప్పటికే బృందావనం తీసి హిట్ అందుకున్న దిల్ రాజు తారక్ తో తీసిన రామయ్య వస్తావయ్య అంచనాలను అందుకోలేకపోయామని తెలిపాడు…అయితే అప్పుడు టైమ్ అస్సలు బాలేదు అని…ఏం చేసిన కలిసి వచ్చేది కాదు అని తెలిపాడు దిల్ రాజు. మొత్తంగా డీజె పై కూడా దిల్ రాజు భారీ అంచనాలే పెట్టుకున్నాడు…కానీ ఆ అంచనాలు కూడా తారుమారు అవడంతో కాస్త వేదాంతం వల్లిస్తూ మాట్లాడుతున్నాడు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus