క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసిన దిల్ రాజు!

  • March 5, 2021 / 03:40 PM IST

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో సినిమాలు చేశారు. దాదాపు అగ్ర హీరోలందరూ దిల్ రాజు బ్యానర్ లో నటించారు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనే ఆయన కోరికను ‘వకీల్ సాబ్’తో తీర్చుకుంటున్నారు. ఇక ఆయన బ్యానర్ లో సినిమాలు చేయని బడా హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మాత్రమే. చిరంజీవి ఫ్యూచర్ లో సినిమా చేసే అవకాశాలు లేకపోలేదు కానీ బాలయ్యతో సినిమా కుదరడంపై మాత్రం దిల్ రాజుకి సందేహాలున్నాయి.

ఎందుకంటే బాలయ్య ఇండస్ట్రీలో అందరితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపరు. తనకు కంఫర్ట్ ఉన్న దర్శకనిర్మాతలతోనే పని చేస్తారు. అయితే దిల్ రాజుకి మాత్రం చాలా రోజులుగా బాలయ్యతో సినిమా చేయాలనుంది. ఫైనల్ గా వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దర్శకుడు అనీల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేసేలా చూస్తున్నాడట. అనీల్ రావిపూడి కూడా గతంలో బాలయ్యతో సినిమా చేయాలనుకున్నారు. ‘రామారావు’ అనే స్క్రిప్ట్ కూడా బాలయ్యకి వినిపించాడు.

కానీ అది వర్కవుట్ కాలేదు. అయినా తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఫైనల్ గా బాలయ్య ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటితో సినిమా చేస్తున్న బాలయ్య.. ఆ తరువాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమా కమిట్ అయ్యారు. అది పూర్తయిన తరువాత అనీల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus