Dilraju: అప్పుడు అంత కాదు ఇంత కాదు అన్న దిల్ రాజు.. ఇప్పుడిలా అంటున్నాడు!

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. తాను నిర్మించే సినిమాల్లోనే కాకుండా పక్క సినిమాల నిర్మాణంలో కూడా భాగస్వామిగా వ్యవహరించాడు అంటే ఆ సినిమా హిట్ అనే నమ్మకం జనాల్లో ఉంది. దీంతో ‘శాకుంతలం’ సినిమాపై కూడా రిలీజ్ కు ముందు అంచనాలు పెరిగాయి. అందుకు ప్రధాన కారణం దిల్ రాజే.. ఆ తర్వాతే సమంత. ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా ‘శాకుంతలం’ గురించి చాలా గొప్పగా చెప్పాడు దిల్ రాజు.

ఇక నుండి గ్లోబల్ మూవీస్ తీయాలనే స్వార్థంతో ‘శాకుంతలం’ లో భాగస్వామినయ్యాను అంటూ (Dilraju) దిల్ రాజు ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. ఇక దర్శకుడు గుణశేఖర్.. తన ‘రుద్రమదేవి’ సినిమా గట్టెక్కడానికి అల్లు అర్జున్ కారణమయ్యాడు.. ఇప్పుడు ‘శాకుంతలం’ గట్టెక్కడానికి దిల్ రాజు నాకు మరో అల్లు అర్జున్ లా అండగా ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. కట్ చేస్తే ఏప్రిల్ 14న విడుదలైన ‘శాకుంతలం’ మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యింది.

పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయింది. దిల్ రాజు పై అలాగే సమంత కూడా ఘోరంగా ట్రోలింగ్ జరిగింది. ‘శాకుంతలం’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అవ్వడానికి కారణం.. దిల్ రాజు నాలుగు రోజుల ముందు ప్రీమియర్స్ వేయడమే అనే వాదన కూడా ఉంది. ప్రీమియర్స్ వేయడం వల్ల సినిమా వీకెండ్ వరకు కూడా నిలబడలేకపోయింది అనేది చాలా మంది అభిప్రాయం.

అయితే ‘శాకుంతలం’ రిజల్ట్ పై సమంత రియాక్ట్ అయ్యింది. ‘కర్మఫలం అనుభవించక తప్పదు’ అంటూ భగవద్గీతలోని ఓ లైన్ పెట్టింది. ఇక ఇప్పుడు దిల్ రాజు వంతు వచ్చింది. ఇటీవల దిల్ రాజు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘ ‘శాకుంతలం’ తన 25 ఏళ్ళ సినీ కెరీర్లో పెద్ద జర్క్ ఇచ్చింది అంటూ దిల్ రాజు చెబుతున్నాడు’. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus