Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ కి మోక్షం ?

  • September 14, 2023 / 02:56 PM IST

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. హ్యాట్రిక్ సక్సెస్ లతో ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ‘జాతి రత్నాలు’ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సినిమాలు ఘన విజయం సాధించాయి. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా వీక్ డేస్ లో కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా భారీ లాభాలను అందించింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ కూడా ఈ సినిమాతో కోలుకుంది.

అంతా బాగానే ఉంది కానీ హీరో (Naveen Polishetty) నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ సినిమా ఏంటి అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నవీన్ పోలిశెట్టి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ‘అనగనగా ఒక రాజు’ అనే మరో సినిమాకి కూడా ఓకే చెప్పాడు. ఆల్రెడీ.. అంటే ఏడాది క్రితమే గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడు. కానీ ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా లేదు.

ఇన్సైడ్ సర్కిల్స్ ప్రకారం.. ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఆగిపోయింది అనే ప్రచారం జరుగుతుంది. దర్శకుడి స్క్రిప్ట్ పై హీరో నవీన్ పోలిశెట్టి సంతృప్తిగా లేకపోవడం వల్ల.. ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపించింది. అలాగే కళ్యాణ్ శంకర్ ను తప్పించి ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ తో ఈ మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లాలి అని హీరో నవీన్ పోలిశెట్టి భావిస్తున్నట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus