Thalaivar 173: ‘ఆరంభిద్దామా’.. ఎట్టకేలకు తలైవాకి డైరక్టర్‌ ఫిక్స్‌… ఎవరంటే?

మొన్నీమధ్యే మనం అనుకున్నాం.. రజనీకాంత్ సినిమాకు దర్శకుడు దొరకకపోవడం ఏంటి? దొరికిన దర్శకుడు మధ్యలోనే సినిమా వదిలేయడం ఏంటి? అని. కొత్త సంవత్సరంలో డైరక్టర్‌ దొరికి కలల కాంబినేషన్‌ పట్టాలెక్కాలి అని కూడా కోరుకున్నాం. అలా కోరుకున్నట్లే తలైవా సినిమాకు దర్శకుడు దొరికేశాడు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్‌ కూడా జరిగింది. ఇటీవల ‘డాన్‌’ సినిమాతో టాలెంటెడ్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సిబి చక్రవర్తి.. ఇప్పుడు రజనీకాంత్‌ – కమల్‌ హాసన్‌ సినిమాకు కెప్టెన్‌.

Thalaivar 173

‘ఆరంభికులమా..’ అంటూ కమల్‌ హాసన్‌ ఈ సినిమాను ఈ రోజు ఘనంగా మరోసారి అనౌన్స్‌ చేశారు. ‘ప్రతి హీరోకి ఓ కుటుంబం ఉంటుంది’ అనే ట్యాగ్‌లైన్‌తో రజనీకాంత్‌ 173వ సినిమా పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తారు. దీంతోపాటు తలైవా – సిబి కలసి దిగిన ఫొటో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ కలసి సినిమా చేయాలని ఎన్నో ఏళ్లుగా అభిమానులు కోరుకున్నారు. ఇద్దరూ ఒకే వేదిక మీదకు వచ్చినప్పుడు, ఒకే వేడుకకు వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వినిపించేది

ఏమైందో ఏమో చాలా ఏళ్లు ఈ ప్రాజెక్ట్‌ ఓకే అవ్వలేదు. కట్‌ చేస్తే మొన్నామధ్య అనూహ్యంగా తామిద్దరం కలసి ఓ సినిమ చేస్తున్నామని కమల్‌ హాసన్‌ అనౌన్స్‌ చేశారు. దీంతో ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడొచ్చు అనుకున్నారంతా. కానీ తాను నిర్మాతను మాత్రమే అని కమల్‌ చెప్పడంతో కాస్త నిరుత్సాహం చెందారు. కానీ కాంబో కుదిరింది కదా అని ఆనందపడ్డారు. ఈ క్రమంలో సినిమా అనౌన్స్‌మెంట్‌ భారీగానే సాగింది.

ప్రముఖ దర్శకుడు సుందర్‌.సి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని కాంబినేషన్‌ ఫొటోలు రిలీజ్‌ చేసి మరీ చెప్పారు. అయితే ఆ ప్రాజెక్ట్ ప్రకటించిన కొన్ని రోజులకే సుందర్‌.సి ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఏమైందా అనేది ఎవరికీ అర్థం కాలేదు. కమల్‌ – రజనీ సినిమాకు దర్శకుడిగా సుందర్‌.సి పేరు అనౌన్స్‌ కాకముందు.. చాలా పేర్లు వినిపించాయి. లోకేశ్‌ కనగరాజ్‌ దాదాపు ఫిక్స్‌ అనుకున్నారు. కానీ ‘కూలీ’ సినిమా తేడా కొట్టడంతో ఆ ప్రాజెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత ప్రదీప్‌ రంగనాథన్‌ పేరు వినిపించింది. వీళ్లెవరూ అవ్వలేదు. ఇక సుందర్‌.సి వద్దు అనుకున్న తర్వాత ‘డ్రాగన్‌’ దర్శకుడు అశ్వత్‌ మరిముత్తు పేరు బయటకు వచ్చింది. ఆ వెంటనే ‘పార్కింగ్’ సినిమా ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ పేరు వినిపించింది. ఇప్పుడు సిబి ఫైనల్‌గా మెగా ఫోన్‌ పట్టుకోనున్నారు.

‘సలార్’ మిస్ చేసుకున్నా..కానీ డెస్టినీ ‘రాజాసాబ్’ లో నటించే ఛాన్స్ ఇచ్చింది: మాళవిక మోహనన్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus