Harish Shankar: హరీష్ శంకర్ కి ఇది మంచి ఛాన్సే.. వర్కౌట్ అయితే..!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కంప్లీట్ చేయాల్సిన సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ఒకటి. హరీష్ శంకర్ (Harish Shankar) దీనికి దర్శకుడు. ‘గబ్బర్ సింగ్’ తో (Gabbar Singh)  బ్లాక్ బస్టర్ కొట్టిన కాంబినేషన్ కాబట్టి.. దీనిపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండటం వల్ల… దీనికి టైం కేటాయించలేకపోతున్నారు. ఆయన ఉన్న బిజీలో సినిమాలకి డేట్స్ ఇవ్వడం కష్టంగా ఉంది. ఒకవేళ డేట్స్ ఇచ్చినా.. ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ‘ఓజి’  (OG Movie) సినిమాలు ముందుగా కంప్లీట్ చేయాలి.

Harish Shankar

అవి కంప్లీట్ అయితేనే పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వరకు రాగలరు. దానికి ఈ ఏడాది వరకు టైం పట్టొచ్చు. అందుకే వేరే హీరో కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతనికి బాలయ్య (Balakrishna) దొరికినట్టు సమాచారం. అవును.. బాలయ్యతో దర్శకుడు హరీష్ సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. హరీష్ చెప్పిన కథ బాలయ్యకి నచ్చింది. సాధారణంగా హరీష్ శంకర్ అంటే ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తాడు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. దాని నుండి బయటకి రావడానికి హరీష్ శంకర్ ఈసారి కొత్త కథతో రాబోతున్నాడట.

వాస్తవానికి మొన్నామధ్య మలయాళంలో హిట్ అయిన ‘ఆవేశం’ (Aavesham) రీమేక్ ను బాలయ్యతో హరీష్ చేస్తున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కానీ దానికి బాలయ్య ఒప్పుకోలేదు. ‘కొత్త కథ చేద్దాం’ అని చెప్పారట. అందువల్ల కొత్త కథ డిజైన్ చేసుకుని ఇటీవల బాలయ్యని అప్రోచ్ అయ్యాడట హరీష్. అతనికి అలాగే కూతురు తేజస్వినికి ఆ కథ నచ్చిందట. ‘మైత్రి’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus