Laila First Review: ‘లైలా’ కవ్వించేలా ఉందా? నవ్వించేలా ఉందా?

Ad not loaded.

వైవిధ్యమైన కథాంశంతో కూడిన సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్ (Vishwak Sen).. మరో రెండు రోజుల్లో అంటే వాలెంటైన్స్ డే రోజున ‘లైలా’ తో (Laila)  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆకాంక్ష శర్మ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) , 30 ఇయర్స్ పృథ్వీరాజ్ (Prudhvi Raj) , బబ్లూ పృథ్వీరాజ్ (Babloo Prithiveeraj) వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి   (Sahu Garapati)  నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ డైరెక్ట్ చేశాడు.

Laila First Review:

ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ తో ‘లైలా’ మరింతగా వార్తల్లో నిలిచింది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొందరు పెద్దలకి టీం చూపించడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. ఈ సినిమా 2 గంటల 16 నిమిషాలు కలిగి ఉందట. లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుకునే ఓ సోనూ వల్ల ఓ పొరపాటు జరుగుతుంది. అది కాస్త అల్లర్లు జరిగే వరకు వెళ్తుందట.

దీంతో అతనిపై పోలీస్ కేసు ఫైల్ అవ్వడం మరోపక్క రౌడీ గ్యాంగ్ అతన్ని చంపాలని ప్రయత్నించడం జరుగుతాయట. ఈ గొడవల నుండి బయటపడటానికి.. తన వల్ల జరిగిన పొరపాటుని సరిదిద్దడానికి హీరో లేడీ గెటప్ వేయాల్సి వస్తుందట. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయని అంటున్నారు. సినిమాలో మెయిన్ హైలెట్ విశ్వక్ సేన్ వేసిన లేడీ గెటప్ అని అంటున్నారు.

ఆ గెటప్లో విశ్వక్ సేన్ బాగా సెట్ అయ్యాడట, కామెడీ కూడా బాగా పండించాడని చెబుతున్నారు. విలన్ గ్యాంగ్ వల్ల వచ్చే కామెడీ కూడా అందరినీ నవ్విస్తుంది అని అంటున్నారు. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బాగున్నట్టు చెబుతున్నారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ కూడా సినిమాకి హైలెట్ అని అంటున్నారు. ప్రేమికుల రోజు నాడు కడుపుబ్బా నవ్వుకునేలా ఈ లైలా ఉందని సినిమా చూసిన వాళ్ళ అభిప్రాయం. మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus