Chiranjeev: ఆ రీజన్ వల్లే మెగాస్టార్ మూవీ ఫ్లాప్.. విజయ భాస్కర్ చెప్పిన విషయాలివే!

చిరంజీవి (Chiranjeevi) సినిమాకు డైరెక్షన్ చేసి సక్సెస్ సాధిస్తే ఆ డైరెక్టర్ రేంజ్ మారిపోతుందనే సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కోసం ఇప్పటికీ చాలామంది డైరెక్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి విజయ భాస్కర్ (K. Vijaya Bhaskar) కాంబినేషన్ లో జై చిరంజీవ (Jai Chiranjeeva) సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. విజయ్ భాస్కర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

చిరంజీవితో వైవిధ్యంతో కూడిన సినిమాను తెరకెక్కించడం నా లక్ అని ఆయన పేర్కొన్నారు. జై చిరంజీవ సినిమా చూడటానికి బాగానే ఉంటుందని స్క్రీన్ ప్లే లోపం వల్ల ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదని విజయ భాస్కర్ చెప్పుకొచ్చారు. జై చిరంజీవ షూటింగ్ కోసం అమెరికాలో చాలా కష్టపడ్డామని హెలికాఫ్టర్ లో ఒక యాక్షన్ సీన్ కూడా ప్లాన్ చేశామని అయితే అనుమతులు రాకపోవడంతో ఆ సీన్ ను షూట్ చేయలేదని ఆయన కామెంట్లు చేశారు.

సమీరా రెడ్డి (Sameera Reddy) పర్ఫామెన్స్ కూడా ఈ సినిమాకు మైనస్ అయిందని చాలామంది భావిస్తారు. జై చిరంజీవ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) సైతం ఎంతో కష్టపడి పని చేశారనే సంగతి తెలిసిందే. జై చిరంజీవ థియేటర్లలో ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఎంతగానో నచ్చింది. బుల్లితెరపై ఈ సినిమాకు ఇప్పటికీ మంచి రేటింగ్స్ వస్తాయి. చిరంజీవి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుంది.

చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబో వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమా అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus