Kodandarami Reddy , Balakrishna: కెరీర్ తొలినాళ్లలో బాలయ్య అలా ఉండేవారట.. ఆ డైరెక్టర్ ఏమన్నారంటే?

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ (Balakrishna) వరుస ప్రాజెక్ట్ లలో నటించడంతో పాటు కెరీర్ పరంగా అంతకంతకూ బిజీ అవుతున్నారు. బాలయ్య ఎంతోమంది స్టార్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చారనే సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో బాలయ్య సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులలో కోదండరామిరెడ్డి (A. Kodandaramireddy) కూడా ఒకరు. బాలయ్య కోదండరామిరెడ్డి కాంబోలో అనసూయమ్మ గారి అల్లుడు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు తెరకెక్కాయి. అయితే కెరీర్ తొలినాళ్లలో బాలయ్య ఏ విధంగా ఉండేవారో కోదండరామిరెడ్డి వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

సీనియర్ ఎన్టీఆర్ గారు నన్ను ఎంతో నమ్మేవారని ఒకసారి సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) బాలయ్య కోసం మంచి కథ సిద్ధం చేయాలని కోరారని ఆయన చెప్పుకొచ్చారు. నేను బాలయ్య కోసం ఒక స్టోరీని సిద్ధం చేయగా ఎన్టీఆర్ కు ఆ కథ వెంటనే నచ్చిందని ఆయన వెల్లడించారు. ఆ స్క్రిప్ట్ నే బాలయ్యతో అనసూయమ్మ గారి అల్లుడు టైటిల్ తో సినిమా తీశానని కోదండరామిరెడ్డి చెప్పుకొచ్చారు.

బాలయ్య గోల్డెన్ స్పూన్ తో పుట్టినా సీనియర్ ఎన్టీఆర్ కొడుకైనా ఆయనలో ఆ గర్వం కొంచెం కూడా లేదని కోదండరామిరెడ్డి కామెంట్లు చేశారు. బాలయ్య సెట్స్ లో అందరికీ నమస్కారం చెబుతూ గౌరవించేవారని ఆయన అన్నారు. బాలయ్య సొంత బ్యానర్ లో సినిమా తెరకెక్కితే టీ తాగారా? భోజనాలు చేశారా? అని కూడా ఆప్యాయంగా అడిగేవారని కోదండరామిరెడ్డి పేర్కొన్నారు.

బాలయ్య అందరితో కలిసి భోజనం చేసేవారని ఆయనలో అణువంతైనా గర్వం ఉండేది కాదని కోదండరామిరెడ్డి వెల్లడించారు. బాలయ్య గురించి గొప్పగా కోదండరామిరెడ్డి చెప్పిన విషయాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news