Lingusamy: రామ్ డైరెక్టర్ లింగుసామీ కి హీరో కావాలట.. పాపం..!

  • September 26, 2023 / 12:26 PM IST

మన స్టార్ హీరోలు ఇప్పుడు అస్సలు ఖాళీగా లేరు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. మిడ్ రేంజ్ హీరోలు అయితే ఒక్కొక్కరూ ఏకంగా రెండు, మూడు సినిమాలతో క్షణం ఖాళీ లేక తీరిగ్గా గడుపుతున్నారు. మన టాలీవుడ్ లో స్టార్ డం కలిగిన చాలామంది దర్శకులు ఇప్పుడు హీరోలు లేక ఖాళీగా ఉంటూ ఓటీటీ ప్రాజెక్టులు, చిన్న సినిమాలకు నిర్మాతలుగా, స్క్రీన్ ప్లే రైటర్లుగా వ్యవహరిస్తున్నారు. అలాంటిది కోలీవుడ్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇచ్చే స్కోప్ ఉందా. అస్సలు లేదు.

అయినా ఓ కోలీవుడ్ డైరెక్టర్ మాత్రం తన నెక్స్ట్ సినిమాకి తెలుగు హీరోనే కావాలంటూ పట్టుబట్టి కూర్చున్నాడు. అతను మరెవరో కాదు లింగుసామి. పందెం కోడి, ఆవారా వంటి చిత్రాలతో తెలుగులో కూడా ఇతను సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఏకంగా అల్లు అర్జున్ సైతం ఇతని వర్క్ కి ఇంప్రెస్ అయిపోయి.. సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి.

కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళలేదు. పోనీ రామ్ ఛాన్స్ ఇస్తే.. ‘ది వారియర్’ వంటి ప్లాప్ ను ఇచ్చి నమ్మకం కోల్పోయాడు.ఆ సినిమాలో హీరోని విలన్ ముందు తక్కువ చేసి చూపించడం అనేది మన తెలుగు ప్రేక్షకులకి రుచించలేదు. లింగు సామి అనే కాదు తమిళ దర్శకులు అంతా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నప్పుడు ఇదే పద్దతిని ఫాలో అయ్యి..

మన వాళ్ళని తక్కువ చేసి చూపిస్తున్నారు. (Lingusamy) లింగు సామికి తెలుగు హీరోల పై ఉన్న ఇష్టంతో ఇప్పుడు సినిమా చేయాలని చూడటం లేదు. తమిళంలో ఏ హీరో కూడా ఇతనితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో తెలుగు హీరోలపై పడుతున్నాడు.మరి ఈసారి ఇతని వలలో చిక్కుకునే టాలీవుడ్ హీరో ఎవరో చూడాలి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus