దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మంచి ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న ఈ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తుండగా, మారేష్ శివన్ తెరకెక్కించారు. సుభాష్ ఆనంద్ సంగీత దర్శకుడిగా ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
ఈ చిత్రానికి ఆండ్రూ కెమెరామెన్.. కింగ్ సోలమన్, రామ కిషన్ యాక్షన్ కొరయోగ్రాఫర్స్. నవంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో దర్శకుడు మారేష్ శివన్ మీడియాతో ముచ్చటించారు. ఈ కథను నేను 2012లో రాశాను.. అదే బ్యాక్ డ్రాప్లో కథ జరుగుతుంది. ప్రతీ మనిషిలో జరిగే కథ ఇదే. ప్రేమ, లక్ష్యం ఒకేసారి ఎంచుకోవాల్సి వస్తే ఏం చేస్తారు.. ఏం చేయాలి అనే మెసెజ్‌తో మూవీని తీశాను. చిత్రాన్ని చూసిన తరువాత కొంత మందైనా మారుతారు.
థియేటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా అదే ట్రాన్స్‌లో ఉంటారు.నా జీవితం అనే కాదు.. ప్రతీ ఒక్కరి జీవితంలో అలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి.. అందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.. ఈ సీన్ మా లైఫ్‌లో జరిగిందే.. ఆ సీన్ మా జీవితంలో జరిగిందే అని అనుకుంటారు. ఇది 2012లో రాసుకున్న కథే అయినా.. ఇప్పటి వారికి కూడా కనెక్ట్ అవుతుంది. టెక్నాలజీ పరంగా పెరిగినా.. ఎమోషన్స్ మాత్రం అవే ఉంటాయి. అందరికీ ఒకే రకమైన ఎమోషన్స్ ఉంటాయి.
ఈ చిత్రం లవ్, ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుంది. ఇందులో హీరో తన లక్ష్యాన్ని, ప్రేమను ఎలా సాధించుకున్నాడు అనేది ఇతివృత్తంగా చూపించాం. ఈ చిత్రానికి సంగీతం ప్లస్ అవుతుంది. అద్భుతమైన పాటలు, ఆర్ఆర్, సంగీతాన్ని అందించారు సంగీతదర్శకలు సుభాష్ ఆనంద్. థియేటర్లో జనాలకు గూస్ బంప్స్ వస్తాయి.
ఈ సినిమాను, పాటలను చూసి త్రినాథరావు నక్కిన లాంటి దర్శకులు ‘ఇది చిన్న సినిమా కాదు.. చాలా పెద్ద హిట్ అవుతుందని’ అన్నారు. ‘కంటతడి పెట్టించావ్’ అని బెక్కెం వేణుగోపాల్ గారు అన్నారు. ‘మాటల్లేవ్’ అని బెల్లంకొండ సురేష్ గారు ప్రశంసించారుముందు 200 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. మౌత్ టాక్ బాగుంటే మళ్లీ థియేటర్లు పెంచొచ్చు అని అనుకుంటుంన్నాం.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!