కడుపుతో ఉన్న అనుష్క శర్మ పై మహిళ సెటైర్లు.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన మారుతీ..!

అనుష్క శర్మ ప్రస్తుతం కడుపుతో ఉన్నట్టు ఆమె భర్త కోహ్లీ ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు 2021 జనవరిలో డెలివరీ అవుతుందని కూడా తెలిపాడు. ‘ఇతంకంటే అదృష్టం ఉంటుందా’ అంటూ అనుష్క, కోహ్లీ సంబరపడిపోతూ ఫోటోలు షేర్ చేశారు. వీళ్లకు సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఎక్కువే కాబట్టి.. ఈ ఫోటోలు వెంటనే వైరల్ అయ్యాయి. అక్కడితో బానే ఉంది. కానీ ఓ లేడీ జర్నలిస్ట్ కు ఏమైందో ఏమో కానీ.. అనుష్క శర్మ ప్రెగ్నెన్సీ పై సెటైర్లు వేస్తూ కామెంట్లు పెట్టింది.

‘అనుష్క శర్మ.. కోహ్లీ నిన్ను తల్లిని మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్ దేశానికి మహారాణిని చెయ్యలేదు. అంతలా సంబరపడాల్సిన అవసరం లేదు’ అంటూ కామెంట్లు పెట్టింది. ఆ లేడీ జర్నలిస్ట్ కామెంట్స్ కు మన టాలీవుడ్ దర్శకుడు మారుతీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ముందుగా ఒక మహిళ జర్నలిస్ట్ అయ్యుండి మీరు ఇలాంటి కామెంట్స్ చేసినందుకు చాలా భాదగా ఉందంటూ మొదలుపెట్టిన మారుతీ…’ఒక రాజ్యానికి రాణి అవ్వడం కంటే.. ఓ బిడ్డకు తల్లి అవ్వడమే…. ఏ స్త్రీకైనా చాలా గొప్ప విషయం.

ఆ సంతోషాన్ని… ఆస్వాదించడం…ఇతరులతో పంచుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. అనుష్క శర్మ ఒక స్టార్ సెలబ్రెటీ కంటే ముందు ఆమె ఒక స్త్రీ అన్న సంగతి మీరు గుర్తించాలి. తల్లి కాబోతున్న ఆనంద క్షణాలను ఆమె ఆస్వాధిస్తుంది. అది ఆమె హక్కు’ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు మారుతీ.

1

2

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus