మహేష్ ఫ్యామిలీ హీరోతో మూవీ చేయనున్న మారుతి

మొదట్లో అడల్ట్ జోకులతో సినిమాలను తెరకెక్కించిన మారుతి.. ఆ మచ్చని తొలిగించుకొని ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. నాని హీరోగా నటించిన “భలే భలే మగాడివోయ్‌” సినిమాతో మారుతి స్టార్ హీరోల దృష్టిలో పడ్డారు. వెంకటేశ్‌ తో బాబు బంగారం మూవీ చేసి అందరినీ నవ్వించారు. తర్వాత శర్వానంద్‌ హీరోగా “మహానుభావుడు” తీసి మరో హిట్ అందుకున్నారు. ఇప్పుడు నాగచైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు మూవీ చేస్తున్నారు. రమ్యకృష్ణ అత్తగా నటించిన ఈ చిత్రం ఈనెల 13 న రిలీజ్ కానుంది. దీని తర్వాత మారుతి ఎవరితో సినిమా తీస్తారా? అనే చర్చలు మొదలు అయ్యాయి.

మొదట్లో మెగా హీరోతో సినిమా చేయడంతో ఆ కాంపౌండ్ లోనే సినిమాలు చేస్తారని భావించారు. ఈ మధ్య అక్కినేని హీరోలతో సినిమాలు చేసేసరికి మళ్ళీ వారితోనే సినిమా చేస్తారని అనుకున్నారు. ఈ రెండు కాంపాండ్ లను కాదనుకొని మహేశ్‌బాబు కాంపౌండ్‌లోకి మారుతి జంప్ అయ్యారు. మహేష్ సోదరి మంజుల నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నాయని మారుతి స్పష్టం చేశారు. అందులో హీరోగా ఎవరనేది చెప్పలేదు కానీ సుధీర్‌బాబు నటించవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో మారుతి ఒక ఫ్యామిలీకి పరిమితం కాకుండా అందరితో సినిమాలు తీయాలని సంకల్పించుకున్నట్టు అర్ధమవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus