నటనా ప్రధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్న నటి హన్సిక. ‘దేశముదురు’ సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించిన హన్సిక దాదాపు దశాబ్ద కాలం పాటు సక్సెస్ ఫుల్ హీరోయిన్గా కొనసాగింది. ప్రస్తుతం ఈమె చేతిలో స్టార్ హీరోల సినిమాలు లేవని చెప్పాలి. ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ మై నేమ్ ఈజ్ శృతి’ శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ మూవీ ప్రమోజన్స్ లో భాగంగా దర్శకుడు ఓంకార్ శ్రీనివాస్ ఆసక్తికరణ అంశాలను పంచుకున్నారు. ఈ సినిమా కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా ఇది. ప్రతి ఒక్కరి జీవితం ఆడవాళ్ళతో ముడిపడి ఉంటుంది. ఆడవారికి సమాజంలో జరుగుతున్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించామని అన్నారు. ఆర్గాన్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందించామని మెడికల్ మాఫియా, కిడ్నీ మాఫియా లాంటివి చూసుంటాం కానీ ఇందులో స్కిన్ కు సంబంధించిన అంశాన్ని తీసుకున్నామని చెప్పారు..
ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాలు చాలా రీసెర్చ్ చేశారని చెప్పారు. స్కిన్ మాఫియా ట్రాప్ లో పడకుండా తనను తాను కాపాడుకునే పాత్రలో హన్సిక కనిపిస్తారు. హన్సిక వాళ్ళ అమ్మ రియల్ గా స్కిన్ డాక్టర్ కావడంతో హన్సిక ఈ స్టోరీ కి బాగా కనెక్ట్ అయ్యారు. హన్సిక స్కిన్ టోన్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయింది. విలేజ్ నుంచి తన డ్రీమ్ ని నెరవేర్చుకోవడానికి సిటీకి వచ్చే అమ్మాయిగా ఆమె కనిపిస్తుంది.
హ్యాపీగా గడుస్తున్న జీవితంలోకి అనుకొని సంఘటన జరుగుతుంది ఆ ఘటనకు హన్సిక ఎలా రియాక్ట్ అయ్యారు అనేది సినిమాలో చూడాల్సిందే. హన్సిక లీడ్ రోల్లో ఓంకార్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.