Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Reviews » Keedaa Cola Review in Telugu: కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!

Keedaa Cola Review in Telugu: కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!

  • November 3, 2023 / 09:21 AM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Keedaa Cola Review in Telugu: కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • తరుణ్ భాస్కర్ దాస్యం, చైతన్య రావు (Hero)
  • N/A (Heroine)
  • జీవన్ కుమార్, బ్రహ్మానందం, రాగ్ మయూర్, రవీంద్ర విజయ్ తదితరులు.. (Cast)
  • తరుణ్ భాస్కర్ దాస్యం (Director)
  • కె.వివేక్ సుధాంషు - సాయికృష్ణ గద్వాల్ - శ్రీనివాస్ కౌశిక్ నండూరి - శ్రీపాడ్ నందిరాజ్ - ఉపేంద్ర వర్మ (Producer)
  • వివేక్ సాగర్ (Music)
  • ఏజే.ఆరోన్ (Cinematography)
  • Release Date : నవంబర్ 04, 2023
  • వి.జి.సైన్మ (Banner)

“ఈ నగరానికి ఏమైంది” లాంటి కల్ట్ కామెడీ అనంతరం కొంత విరామం తీసుకొని.. తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన తాజా చిత్రం “కీడా కోలా”. క్రైమ్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం మేకింగ్ టైమ్ నుంచి ట్రెండ్ అవుతూ వచ్చింది. ఈ క్రైమ్ కామెడీకి బ్రహ్మానందం తొడవ్వగానే మరింత ఆసక్తి పెరిగింది. నవతరం ఆర్టిస్టులు & టెక్నీషియన్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం మీద విశేషమైన అంచనాలున్నాయి. తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో యువత ఈ సినిమాపై భీభత్సమైన అంచనాలు పెట్టుకొన్నారు. దీనికి వివేక్ సాగర్ పాటలు తొడయ్యాయి. మరి తరుణ్-వివేక్ కాంబినేషన్ ఈసారి ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగారా? లేదా? అనేది చూద్దాం..!!

కథ: తాతయ్య వరదరాజులు (బ్రహ్మానందం) అడిగాడు కదా అని కూల్ డ్రింక్ కొనుక్కొని ఇంటికొస్తాడు మనవడు వాస్తు (చైతన్య రావు) & అతడి ఫ్రెండ్ కౌశిక్ అలియాస్ లంచం (రాగ్ మయూర్). కట్ చేస్తే.. ఆ కీడా కోలా బాటిల్ లో నిజంగానే కీడా (బొద్దింక) ఉంటుంది. దొరికిందే ఛాన్స్ అని లాయర్ అయిన లంచం లీగల్ కేస్ వేసి కోట్లు కొట్టేద్దామనుకుంటాడు. మళ్ళీ కట్ చేస్తే.. కథలోకి ఎంటర్ అవుతారు నాయుడు (తరుణ్ భాస్కర్) & జీవన్ (జీవన్ కుమార్). వీళ్ళ ఎంట్రీతో కథా గమనం మొత్తం మారిపోతుంది.

ఇంతకీ కీడా కోలా కూల్ డ్రింక్ టీం వీళ్ళకి డబ్బులు ఇచ్చారా? ఆ డబ్బులు తీసుకోవడానికి ఎంత ఇబ్బందిపడ్డారు? వాళ్ళు ఎదుర్కొన్న అవరోధాలు ఏమిటి? అనేది “కీడా కోలా” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాలో క్యాస్టింగ్ వైజ్ ఎలాంటి ప్రియారిటీ లేదు కానీ.. ఉన్నవాళ్ళలో అందరికంటే ఎక్కువ స్క్రీన్ ప్రెజన్స్ & స్క్రీన్ టైమ్ ఉన్న క్యారెక్టర్ మాత్రం జీవన్ ది. మొండోడిగా జీవన్ నటన & చిన్నపాటి విలనిజం బాగా వర్కవుటయ్యాయి. నాయుడుగా తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో పూర్తిస్థాయి నటుడిగా ఆకట్టుకున్నాడు. నత్తి లాంటి వ్యాధితో బాధపడే యువకుడిగా చైతన్య రావు, లాయర్ గా రాగ్ మయూర్, కంపెనీ ఓనర్ గా రవీంద్రలు అలరించారు. షాట్స్ పాత్రలో రఘురాం బాగా నవ్వించాడు.

సీనియర్ నటులు బ్రహ్మానందంను ఒకట్రెండు సీన్స్ మినహా సరిగా వినియోగించుకోలేదు. ఎమోషనల్ సీన్ లో మాత్రం తన సీనియారిటీ నిరూపించుకున్నారు బ్రహ్మీ.

సాంకేతికవర్గం పనితీరు: వివేక్ సాగర్ సంగీతం గురించి ముందుగా చెప్పుకోవాలి. సినిమా థీమ్ కి తగ్గట్లు హట్కే మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. పాటలకి పెద్దగా స్కోప్ లేని ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ తో కథా గమనానికి కేంద్రబిందువుగా నిలిచాడు వివేక్ సాగర్. అతడి మాస్ బీజీయమ్స్ సినిమాను, సినిమాలోని ఎమోషన్స్ ను అద్భుతంగా ఎలివేట్ చేశాయి. ఆరోన్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మరో ఎస్సెట్ గా నిలిచింది. ముఖ్యంగా షూటింగ్ సీక్వెన్స్ ను తెరకెక్కించిన విధానం అబ్బురపరుస్తుంది. ఇక కోలాలో కీడా కలిపే సీక్వెన్స్ లను హాలీవుడ్ స్టైల్లో తెరకెక్కించిన విధానం నవతరం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బాగున్నాయి.

ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే.. ఈ సినిమాతో డైరెక్టర్ గా కంటే యాక్టర్ గా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. టెక్నికల్ గా సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించినప్పటికీ.. కథకుడిగా & దర్శకుడిగా మాత్రం అతడిలోని పూర్తిస్థాయి ప్రతిభ ఈ చిత్రంలో కనబడలేదనే చెప్పాలి. కొన్ని పంచ్ డైలాగులు & కామెడీ సీక్వెన్స్ లతో మాత్రం విపరీతంగా ఆకట్టుకున్నాడు . కానీ ఓవరాల్ గా మాత్రం బొటాబోటి మార్కులతో సరిపెట్టుకున్నాడు. తదుపరి చిత్రం విషయంలోనైనా టెక్నికల్ అంశాలతోపాటు సినిమాకి చాలా కీలకమైన కతకథనాలపై దృష్టి సారిస్తాడని కోరుకుందాం.

విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా.. ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరు కలిసి వెళ్తే థియేటర్లో మస్తుగా ఎంజాట్ చేసే సినిమా “కీడా కోలా”. టెక్నికల్ గా రిపీట్స్ లో చూడదగ్గ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ చిత్రం కథ-కథనం విషయంలో తరుణ్ భాస్కర్ ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే మరో కల్ట్ కామెడీ సినిమాగా చరిత్రలో నిలిచిపోయేది.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya Rao Madadi
  • #Keedaa Cola
  • #Rag Mayur
  • #Tharun Bhascker

Reviews

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ee Nagaraniki Emaindi : అంత బడ్జెట్‌ పెంచేశారు.. క్రేజీ సీక్వెల్‌ వర్కవుట్‌ అవుతుందా?

Ee Nagaraniki Emaindi : అంత బడ్జెట్‌ పెంచేశారు.. క్రేజీ సీక్వెల్‌ వర్కవుట్‌ అవుతుందా?

trending news

The RajaSaab Collections: 2వ వారం కూడా పర్వాలేదనిపించింది.. కానీ కష్టమే

The RajaSaab Collections: 2వ వారం కూడా పర్వాలేదనిపించింది.. కానీ కష్టమే

24 mins ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ 10 రోజుల వసూళ్లు… బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ 10 రోజుల వసూళ్లు… బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

40 mins ago
Anaganaga Oka Raju Collections: 9వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 9వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

54 mins ago
Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచిన ‘నారీ నారీ నడుమ మురారి’

1 hour ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ కుమ్మేస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ కుమ్మేస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’

1 hour ago

latest news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

2 hours ago
Zarina Wahab: నానమ్మగా కలిసి రాలేదు.. అమ్మగా ఫుల్ మర్క్స్ పడిపోయాయి

Zarina Wahab: నానమ్మగా కలిసి రాలేదు.. అమ్మగా ఫుల్ మర్క్స్ పడిపోయాయి

3 hours ago
Akhanda & Rajasaab: అత్యాశకు పోయి అసలుకే మోసం తెచ్చుకుని.. రెండు పెద్ద ఫ్లాప్‌లకు కారణాలు

Akhanda & Rajasaab: అత్యాశకు పోయి అసలుకే మోసం తెచ్చుకుని.. రెండు పెద్ద ఫ్లాప్‌లకు కారణాలు

4 hours ago
Tollywood: టాలీవుడ్‌ @ బ్యాడ్‌ సిట్యువేషన్‌: స్లాట్స్‌ ఖాళీగా మళ్లీ రండమ్మా!

Tollywood: టాలీవుడ్‌ @ బ్యాడ్‌ సిట్యువేషన్‌: స్లాట్స్‌ ఖాళీగా మళ్లీ రండమ్మా!

5 hours ago
Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

Thaman: పాన్ ఇండియా సినిమాలకి థమన్ మ్యూజిక్ కలిసి రావడం లేదా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version