నాజర్, సంగీర్ధన, చరణ్ రాజ్, ఎస్.ఎస్. కాంచి , శ్రీమాన్, ఫిష్ వెంకట్ , తేజ్ చరణ్ రాజ్ తదితరులు (Cast)
సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ (Director)
డా.అజ్జా శ్రీనివాస్ (Producer)
ఏ ఐ ఎస్ నాఫాల్ రాజా (Music)
నాని చమిడిశెట్టి (Cinematography)
Release Date : నవంబర్ 3, 2023
‘లండన్ బాబులు’ ‘పలాస’ వంటి రెండు విభిన్న కథా చిత్రాలు చేసి ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్ అట్లూరి. దీంతో అతని సినిమా అంటే కచ్చితంగా అందులో ఆకట్టుకునే అంశాలు ఉంటాయి అని కొంత మంది ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. కాబట్టి అతని నెక్స్ట్ మూవీ ‘నరకాసుర’ పై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం రండి :
కథ: శివ(రక్షిత్ అట్లూరి) ఓ లారీ డ్రైవర్. అతను ఒక టీ ఎస్టేట్ లో పనిచేస్తూ ఉంటాడు. అలాగే ఆ ఊరి పెద్ద అయిన నాగమ నాయుడు( చరణ్ రాజ్) ని ఎం.ఎల్.ఎ ని చేయడంతో పాటు ఆ ఊరికి అండగా నిలబడతాడు. ఆ ఊర్లో ఎవరు తప్పు చేసినా శివ వారిని హతమారుస్తూ ఉంటాడు. మరోపక్క అతను టీ ఎస్టేట్ సూపర్వైజర్ అయిన మీనాక్షి(అపర్ణ జనార్దన్) ని ప్రేమిస్తాడు. అలాగే వీరిద్దరూ కలిసి ఒక రోజు ఔటింగ్ కి వెళతారు.
అక్కడ శివ ఊహించని విధంగా హిజ్రాలపై నోరు పారేసుకుని వారి మనోభావాలు దెబ్బ తీయడమే కాకుండా వారితో గొడవ కూడా పెట్టుకుంటాడు? తర్వాత వారు శివని వెంటాడతారు? అప్పుడు ఏమైంది? హిజ్రాల వల్ల శివ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? అసలు నాగమ నాయుడు ఎవరు? శివ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: శివ పాత్రలో రక్షిత్ అట్లూరి బాగానే పెర్ఫార్మ్ చేశారు. యాక్షన్ సన్నివేశాల్లో గ్రేస్ చూపించాడు. హీరోయిన్లు అపర్ణ జనార్ధన్, సంగీర్ధన..ల లుక్స్ బాగానే ఉన్నాయి. కానీ పెర్ఫార్మన్స్ పరంగా అంతగా ఆకట్టుకుంది అంటూ ఏమీ లేదు. చరణ్ రాజ్ పాత్ర అటు సహాయనటుడు గాను కాకుండా, విలన్ గాను కాకుండా.. ఉంది. అయితే తన మార్క్ పెర్ఫార్మన్స్ తో పర్వాలేదు అనిపిస్తాడు. నాజర్ పాత్ర అతికి పరాకాష్ట అన్నట్టు ఉంది.
హిజ్రాగా కనిపించిన శత్రు నటన బాగుంది.ఎక్కువగా డైలాగులు లేకపోయినా కనుసైగలతోనే ఆ పాత్రకి న్యాయం చేశాడు. ఇక శ్రీమాన్ పాత్ర కూడా నాజర్ పాత్రకి ఏమాత్రం తీసిపోలేదు. ఫిష్ వెంకట్ తనకు అలవాటైన ఫ్రస్ట్రేషన్ కామెడీతో కాసేపు నవ్వులు పూయించి రిలీఫ్ ఇచ్చాడు.
సాంకేతిక నిపుణుల పనితీరు: ఫస్ట్ హాఫ్ లో దాదాపు 40 నిమిషాలు కథ ఎక్కడ మొదలయ్యిందో, ఎటువైపు వెళ్తుందో అర్థం కాదు. పైగా పేలవమైన కామెడీ .. గందరగోళానికి గురి చేస్తుంది. బలవంతంగా నవ్వుకోవాలి తప్ప.. అది అందరికీ కనెక్ట్ అయ్యే కామెడీ ట్రాక్ అయితే కాదు. ఇక కథలోకి వెళ్తుంది అనుకునే టైంకి ఇంటర్వెల్ పడుతుంది. పోనీ సెకండ్ హాఫ్ ఏమైనా ఎంగేజ్ చేసిందా అంటే.. ఫస్ట్ హాఫ్ కి మించి ఇరిటేషన్ తెప్పించింది అనడంలో అతిశయోక్తి కాదు.
అయితే హిజ్రాల ట్రాక్ ను దర్శకుడు సెబాస్టియన్ నోవా అకోస్టా డిజైన్ చేసిన తీరు బాగుంది. వారిపై గౌరవం పెంచేలా ఆ ట్రాక్ ఉందని చెప్పవచ్చు. కానీ కథకి ఆ ట్రాక్ ఎక్కువగా కనెక్ట్ అయ్యింది లేదు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్ నెస్ ను తీసుకొచ్చింది అనుకోవచ్చు. ఎడిటింగ్ బాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ: టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్న రేంజ్లో ‘నరకాసుర’ (Narakasura) లేదు అని చెప్పడంలో సందేహం లేదు. హిజ్రాల ట్రాక్ తప్ప.. మిగిలిందంతా రొట్ట కొట్టుడే..!
రేటింగ్ : 1.5/5
Rating
1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus