Prasanth Varma Wife: దర్శకుడు ప్రశాంత్ వర్మ ఫ్యామిలీ ఫోటోలు వైరల్..!

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అందరికీ సుపరిచితమే. పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించిన అతను ఆ తర్వాత నాని నిర్మాణంలో వచ్చిన ‘అ!’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా తక్కువ బడ్జెట్లో ఎంతో క్వాలిటీగా సినిమా చేయగలను అని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో వెంటనే అతనికి సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. అలా చేసిన ‘కల్కి’ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది.

ఆ సినిమాతో ప్రశాంత్ వర్మ పని అయిపోయింది అనే కామెంట్లు కూడా వినిపించాయి. కానీ వెంటనే ‘జాంబీ రెడ్డి’ తో సూపర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి అతని డైరెక్షన్లో వచ్చిన ‘హనుమాన్’ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఇప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూనే ఉంది. ఆ ఒక్క సినిమాతో ఇతను పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు అని అంతా భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రశాంత్ వర్మకి (Prasanth Varma) పెళ్లైంది అని ఎక్కువ మందికి తెలిసుండదు. కానీ అతనికి నిజంగానే పెళ్లి అయ్యింది. ప్రశాంత్ వర్మ భార్య పేరు సుకన్య. ‘హనుమాన్’ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ గురించి గూగుల్ లో ఎక్కువ సెర్చ్ లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అతని ఫ్యామిలీ ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus