Rajamouli: ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు ఇష్టమైన హీరో ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ లకు ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలను అవార్డులతో పాటు ప్రశంసలు వస్తే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో బిజీ అవుతుండగా వచ్చే నెలలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

అయితే రాజమౌళి (Rajamouli) ఫేవరెట్ హీరో, ప్రశాంత్ నీల్ డ్రీమ్ హీరో ఒక్కరే అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కావడం గమనార్హం. పలు సందర్భాల్లో రాజమౌళి, ప్రశాంత్ నీల్ తారక్ గురించి చెబుతూ ఈ కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో ఇప్పటికే నాలుగు సినిమాలు తెరకెక్కగా ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి.

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో మూవీ షూట్ 2024 సంవత్సరం మార్చి నెలలో మొదలు కానుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రతి సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను సైతం రెండు పార్టులుగా తెరకెక్కించే ఛాన్స్ అయితే ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కోరుకున్న ఇండస్ట్రీ హిట్ ఈ సినిమాతో దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ రోల్ ఈ సినిమాలో పవర్ ఫుల్ గా ఉండనుందని సమాచారం. మైత్రీ నిర్మాతలు, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ వార్2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus