Chalapathi Rao: కెవ్వుకేక బూతులపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Advertisement

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. అల్లరి నరేష్ 8ఏళ్ళ క్రితం నటించిన కెవ్వు కేక సినిమాలో చలపతి రావు సీన్ బండ బూతులతో ఉండడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ రోజుల్లో మీమర్స్ కు కాస్త సందు దొరికితే మొత్తం లాగేస్తున్నారు. ఇక ఆ అనుమానం ఎలా వచ్చిందో ఏమో గాని కెవ్వు కేక సినిమాలో అల్లరి నరేష్ ను తిట్టే సీన్ ను స్లో మోషన్ లో చూస్తే గాని అర్థమవ్వలేదు.

యూ ట్యూబ్ లో కెవ్వు కేక సినిమాను 34:18 నిడివి దగ్గర 0.25x స్పీడ్ తో వింటే ఆ బూతులు గోల ఎంత దారుణంగా ఉందొ అర్ధమవుతుంది. సీన్ ను ఫాస్ట్ గా ఫార్వార్డ్ చేయడంతో అప్పట్లో ఎవరు పట్టించుకోలేదు. ఇక సెన్సార్ బోర్డును చాలా తెలివిగా మోసం చేశారని చెప్పవచ్చు. ఇక 8 ఏళ్ళ తరువాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చలపతి రావుకు సంబంధించిన బూతులు సీన్ వైరల్ అవ్వడంతో ఆ విషయంపై దర్శకుడు దేవి ప్రసాద్ స్పందించక తప్పలేదు.

రాత్రే నా దృష్టికి వచ్చిందండీ. ఆ చండాలం ఎలా జరిగిందో ఇప్పటికి అర్థం కాలేదు. షూటింగ్ లో అయితే ఆయన బాగానే చెప్పారు. డబ్బింగ్ కు నేను వెళ్లలేదు. అక్కడ ఫాస్ట్ చేసి ఎడిటింగ్ కు వచ్చిన డైలాగ్ మాత్రమే తెలుసు.. అంటూ డైరెక్టర్ దేవి ప్రసాద్ సోషల్ మీడియాలో ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక ఈ ఫాస్ట్ ఫార్వార్డ్ సీన్ సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతోంది. బూతులు మాత్రం మీర్జాపూర్ మున్నా బాయ్ కంటే దారుణంగా ఉన్నాయని అంటున్నారు.


‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus