Shankar: చరణ్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌… ‘గేమ్‌ ఛేంజర్‌’ బ్లాక్‌బస్టర్‌ అప్‌డేట్‌ ఇచ్చిన శంకర్‌

రామ్‌చరణ్‌ (Ram Charan) ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌. ఇంకా చెప్పాలంటే ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న గుడ్‌ న్యూస్‌. ఎన్నో ఆశలతో ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2)  ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వెళ్లిన, టీవీల్లో, యూట్యూబుల్లో చూసిన రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కి దర్శకుడు శంకర్‌ (Shankar)  గుడ్‌ న్యూస్‌ చెప్పేశారు. గుడ్‌ న్యూస్‌, గుడ్‌ న్యూస్‌ అంటున్నారు.. అసలు విషయం ఏంటి అనుకుంటున్నారా? చెబుతాం, చెబుతాం. ఇన్నాళ్లుగా ఇలా చెప్పకుండా ఊరిస్తూ వచ్చిన శంకర్‌ ఆ విషయం చెప్పేశారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాకు సంబంధించి షూటింగ్‌ అప్‌డేట్‌ను శంకర్‌ అనౌన్స్‌ చేశారు.

రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ అయిపోయిందని తీపి కబురు చెప్పేశారు. మరో పది, పదిహేను రోజులు షూటింగ్‌ చేస్తే డబుల్‌ పాజిటివ్‌ రెడీ అయిపోతుందని క్లారిటీ ఇచ్చేశారు. అంటే పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసేస్తారన్నమాట. అయితే శంకర్‌ పోస్ట్‌ప్రొడక్షన్‌కి కూడా ఎక్కువ సమయం తీసుకుంటారు అనేది ఇక్కడ మెలిక. మాకు ఇన్నేళ్లుగా సపోర్ట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకుల కోసం స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేయాలని చాలా రోజులుగా ఉండింది.

‘గేమ్ ఛేంజర్’ సినిమా ద్వారా ఆ అవకాశం దొరికింది అని శంకర్‌ చెప్పారు. రామ్ చరణ్‌ది ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన దగ్గర కంట్రోల్డ్ పవర్ ఉంటుంది అని చక్కటి ఎలివేషన్‌ ఇచ్చారు శంకర్‌. ఆ పవర్‌ ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా అనేదే ఇక్కడ విషయం. చరణ్‌ ఎంత మంచి యాక్టర్ అనేది సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అని అన్నారు శంకర్‌. రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్‌లో దిల్‌ రాజు (Dil Raju) తన బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మక 50వ సినిమాగా ఈ‘గేమ్‌ ఛేంజర్‌’ని నిర్మిస్తున్నారు.

ఈ ఏడాది ఎలాగైనా సినిమాను విడుదల చేయాలన్నది దిల్‌ రాజు సంకల్పం. మరి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఎంత వేగంగా పూర్తి చేస్తారు అనేది చూడాలి. అయితే ‘భారతీయుడు 2’ అయ్యాక ‘గేమ్‌ ఛేంజర్‌’ పనులు చేస్తారో లేక ‘భారతీయుడు 3’ పనులు చేస్తారా? అనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus